జాతీయ వార్తలు

బంధం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఇరాన్‌తో సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా ఇరుదేశాల మధ్య శనివారం జరిగిన విస్తృత చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. భారత్ పర్యటనకు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ, మోదీల మధ్య జరిగిన విస్తృతస్థాయి చర్చల సందర్భంగా ఇరుదేశాల మధ్య తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి. కీలకమైన రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇరుదేశాల మధ్య అనుసంధానత, పర్యాటకం, విద్యుత్, ఉగ్రవాదం సహా అనేక అంశాలపై మధ్య కుదిరిన ఆ ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ప్రాంతీయంగా నెలకొన్న పరిస్థితులపై మోదీ, రౌహనీ విస్తృతస్థాయి చర్చలు జరిపారు. చర్చల ఫలితాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతకుముందు చర్చల వివరాలను మోదీ, హసన్ రౌహనీ సంయుక్త విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విస్తృత సహకారం, స్నేహ సంబంధాలు పటిష్టం చేసుకోవడంపై ఇరుదేశాలు ఎంత ఆసక్తిగా ఉన్నాయో రౌహనీ పర్యటన తేటతెల్లం చేస్తోందన్న మోదీ ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణావల్ల ఏర్పడుతున్న సమస్యలపై విస్తృత చర్చలు జరిపామని చెప్పారు. వూహ్యాత్మకంగా కీలకమైన చాబహర్ ఓడరేవు అభివృద్ధి విషయంలో ఇరాన్ అధ్యక్షుడు చూపిన నాయకత్వ పటిమను మోదీ ప్రశంసించారు. ఇరుదేశాల మధ్య వీసా విధానంలో సరళతరం చేసేలా మార్పులు, రెండుపన్నుల విధానంలో మార్పులపై ఇరుదేశాలు తమ ఆలోచనలను పరస్పరం పంచుకున్నాయని ఉభయ దేశాల నాయకులు చెప్పారు. కాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ, ప్రాంతీయ వివాదాలను దౌత్య ప్రక్రియ, రాజకీయ చర్యల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంతో పోరాటానికి తమదేశం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు రాష్టప్రతి భవన్‌కు చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీకి హార్దిక స్వాగతం లభించింది. ఉదయం జరిగిన భేటీ సందర్భంగా రౌహనీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వివిధ అంశాలపై చర్చలు జరిపారు.

చిత్రం..భారత్- ఇరాన్‌ల మధ్య కుదిరిన ప్రాధాన్యతా ఒప్పందాలకు సంకేతంగా న్యూఢిల్లీలో శనివారం పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్న ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ, ప్రధాని నరేంద్ర మోదీ