జాతీయ వార్తలు

మద్దతుకోసం లంచం ఎర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/డెహ్రాడూన్, మార్చి 26: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై తీవ్రమైన ఆరోపణ చేశారు. సోమవారం రాష్ట్ర శాసనసభలో జరుగనున్న బలపరీక్షలో తనకు మద్దతు తెలపాల్సిందిగా కోరుతూ రావత్ తమకు లంచం ఇవ్వజూపాడని వారు ఆరోపించడంతోపాటు ఇందుకు సంబంధించిన ‘స్టింగ్ ఆపరేషన్’ వీడియోను కూడా విడుదల చేశారు. ఇదంతా వట్టి బూటకమని రావత్ తోసిపుచ్చారు. ఇవన్నీ బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతోపాటు ఆయన అనుచరులు వేస్తున్న చౌకబారు ఎత్తుగడలని కాంగ్రెస్ ఆరోపించగా, హరీష్ రావత్ ప్రభుత్వాన్ని తక్షణమే డిస్మిస్ చేయాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ఢిల్లీలో ఈ ‘స్టింగ్ వీడియో’ సిడీని విడుదల చేశారు. తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుకోసం రావత్ లంచాలు ఇవ్వజూపుతూ అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఈ సిడీలోని దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయని విజయ్ బహుగుణ పేర్కొంటూ, రావత్‌కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని, కనుక ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో హరీష్ రావత్ డెహ్రాడూన్‌లోని తన నివాసంలో హడావిడిగా విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటుచేసి వార్తా చానళ్లలో చూపించిన ‘స్టింగ్ వీడియో’ నకిలీదని తోసిపుచ్చారు. దీని వెనుక ప్రైవేటు వార్తా చానల్‌తో సంబంధాలున్న ఒక వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తి ఎవరో, ఆయన పలుకుబడి ఏమిటో అందరికీ తెలుసని, కనుక ఆయన కుట్రలపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని రావత్ అన్నారు. ఇది నకిలీ సిడీ అయినప్పటికీ డబ్బుకోసం కాంగ్రెస్ తిరుగబాటు ఎమ్మెల్యేలు బిజెపితో చేతులు కలిపినట్లు ఈ సిడీ స్పష్టం చేస్తోందని రావత్ పేర్కొన్నారు.