జాతీయ వార్తలు

పీఎన్బీని ముంచింది షెట్టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కొనే్నళ్ల క్రితం జరిగిన కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోణం తరువాత యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మరోమెగా స్కామ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 11,400 కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెట్టడం. ఈ అక్రమ లావాదేవీలన్నీ ముంబయిలోని పీఎన్‌బీ బ్రాంచ్‌లోనే జరగడం. మూడు రోజుల క్రితం వెలుగుచూసిన ఈ భారీ కుంభకోణం లోతుల్లోకి వెళ్తే- అసలు అక్రమాలు ఏ విధంగా జరుగుతాయి? బ్యాంకు పెద్దల సహకారం లేనిదే ఇలాంటివి అసాధ్యమన్న వాస్తవం కళ్లకు కడుతుంది. మామూలుగానే తమకు 280 కోట్ల రూపాయల మేర నష్టాన్ని కలిగించారంటూ బ్యాంక్ అధికారులు మూడు కంపెనీలు, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ సహా నలుగురిపై కేసు పెట్టారు. దాంతో డొంకంతా కదిలింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి దారితీసిన నేపథ్యం ఇలా ఉంది.
సాధారణంగా పెద్ద కంపెనీలు, బడా వ్యాపారవేత్తలకు బ్యాంకులు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్‌ఓయూ) అనే హామీ పత్రాన్ని అందిస్తాయి. దీని ఆధారంగా సదరు వ్యక్తులు, బ్యాంకులు రుణం పొందేందుకు వీలుంటుంది. జనవరి 16న నీరవ్ మోదీకి చెందిన గీతాంజలి గ్రూపు ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఎల్‌ఓయూ కోరింది. అంతకుముందు వరకూ ఈ వ్యవహారాల్లో నీరవ్ మోదీకి సహకరించిన డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ షెట్టి రిటైర్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. గోకుల్‌నాథ్ స్థానే కొత్త డిప్యూటీ మేనేజర్ బాధ్యతలు తీసుకున్నారు. వంద శాతం మార్జిన్ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే తప్ప లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ ఇవ్వలేమని మోదీ కంపెనీకి స్పష్టం చేసినట్టు తెలిసింది. దాంతో అంతకుముందు వరకూ బ్యాంకు నుంచి ప్రయోజనం పొందిన నీరవ్ కంపెనీ అధికారులకు కోపం వచ్చింది. గతంలో ఎప్పుడూ కూడా తమను మార్జిన్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఎవరూ కోరలేదని సదరు అధికారులు స్పష్టం చేశారు. దాంతో కొత్త డీఎంకు అనుమానం వచ్చింది. గతంలో మార్జిన్ మనీ లేకుండా ఎల్‌ఓయూలు ఎలా ఇచ్చారంటూ కూపీలాగడం మొదలెట్టారు. ఆ విధంగా ఈ 11,400 కోట్ల భారీ కుంభకోణం బహిర్గతమైంది. గోకుల్‌నాథ్ షెట్టి ఉన్నప్పుడు నీరవ్ మోదీ కంపెనీ ఎప్పుడు కావల్సివస్తే అప్పుడు ఎలాంటి సమస్యా లేకుండా ఎల్‌ఓయూ తెచ్చేసుకొనేది. ఈ హామీ పత్రాన్ని అక్రమంగా ఇవ్వడంతో షెట్టి పూర్తిగా సహకరించినట్టుగా తాజా కథనాల వల్ల తెలుస్తోంది. ఈ విధంగా పొందిన హామీ పత్రాల ద్వారానే అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు చెంది విదేశీ శాఖల నుంచి 280.7 కోట్ల రూపాయల రుణాన్ని నీరవ్ మోదీ పొందగలిగారు. బ్యాంక్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలను బట్టి సదరు విదేశీ బ్యాంకు బ్రాంచ్‌లకు గోపీనాథ్ షెట్టి ‘స్విట్’ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. డైమండ్ ఆర్ యుఎస్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లర్ డైమండ్స్ పేరుతో ఈ లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ పత్రాలు జారీ అయ్యాయి. ఈ 280 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై బ్యాంక్ అధికారులు జనవరిలో దృష్టిసారించేనాటికే వాటి కాలపరిమితి తీరే పరిస్థితి ఏర్పడింది. దాంతో తామిచ్చిన రుణాలు వెనక్కి ఇవ్వాలంటూ ఇతర బ్యాంకులు పీఎన్‌బీపై ఒత్తిడి తెచ్చాయి. దాంతో ఈ కుంభకోణం 280 కోట్లు కాదని వేల కోట్లలోనే ఉందన్న వాస్తవం అనంతరం జరిపిన దర్యాప్తులో బయటపడింది. వెంటనే ఈ తరహా లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ కలిగిన బ్యాంకులు తమకు అందివుంటే వెంటనే వాటిని ధ్రువీకరించుకోవాలంటూ పీఎన్‌బీ మెస్సెజ్‌లు పెట్టింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి బండారం బయటపడి ఉచ్చు బిగుసుకునే లోపే నీరవ్ మోదీ కుటుంబం దేశం వదలి పారిపోయింది. ప్రస్తుతం ఆయన న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న గోకుల్‌నాథ్ షెట్టిని అరెస్టు చేసినప్పటి నుంచి అనేక నిజాలు బయటపడుతున్నాయి.