జాతీయ వార్తలు

భారత్‌తో సంబంధాల పటిష్ఠతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భారత్‌తో సంబంధాలను పటిష్టం చేసుకునే లక్ష్యంతో వారం రోజుల పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ శనివారం ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోదీతో రక్షణ, ఉగ్రవాదంపై పోరాటం సహా పలు అంశాలపై విస్తృత చర్చలు జరుపనున్నారు. భార్య, ముగ్గురు పిల్లలతో కలసి భారత్ పర్యటనకు వచ్చిన జస్టిన్ ట్రుడూ ఆగ్రా, అహ్మదాబాద్, ముంబై, అమృతసర్‌లలో పర్యటిస్తారు. కాగా గుజరాత్‌లో పర్యటిస్తున్న తొలి కెనడా ప్రధాని ఆయనే. దాదాపు 1.4 మిలియన్ల మంది భారత సంతతికి చెందినవారు ఆ దేశంలో ఉన్నందున కెనడా ప్రధాని పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది. తన పర్యటనలో ప్రముఖ వాణిజ్యవేత్తలు, సినీరంగ ప్రతినిధులు, విద్యార్థులతో మాట్లాడతారు. ఆదివారం నాడు ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించాక మర్నాడు సబర్మతీ ఆశ్రమాన్ని తిలకిస్తారు. అక్కడి నుంచి గాంధీనగర్ చేరుకుని అక్షరధామ్‌ను సందర్శిస్తారు. అనంతరం ఐఐఎం (అహ్మదాబాద్)లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 20న వాణిజ్య, సినీ ప్రముఖలతో భేటీ, 21న అమృతసర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శిస్తారు. కెనడాలోని ఎన్‌ఆర్‌ఐలలో అత్యధికులు పంజాబీలే. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రుడూ స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదు, క్రికెట్ మైదానాలను చూసిన తరువాత కెనడా, ఇండియా వాణిజ్య ప్రముఖలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 23న ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరిపిన తరువాత 24న యంగ్ చేంజ్ మేకర్స్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

చిత్రం..వారం రోజుల పర్యటన నిమిత్తం శనివారం కుటుంబ సమేతంగా ఢిల్లీ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ