జాతీయ వార్తలు

సమున్నత జ్ఞానం.. ప్రగతి సాధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికోడ్, ఫిబ్రవరి 17: భారత్‌లో 65 శాతం జనాభా 35ఏళ్ల లోపువాళ్లేనని, యువ భారతాన్ని అవకాశంగా తీసుకుని జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, విద్యాసంస్థలు నవ భారత నిర్మాణానికి నడుం కట్టాలని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ ఫరూక్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ, ఆధారపడే దయనీయ నుంచి బంధవిముక్తం చేయగల సాధనం ఒక్క జ్ఞానం మాత్రమేనన్నారు. ఆత్మస్థయిర్యం, వ్యక్తిత్వ వికాసం విద్యతోనే సాధించగలమన్న విషయాన్ని విద్యార్థులు సదా గుర్తుంచుకోవాలని సూచించారు. ఏ మత విధానాలు విశే్లషించినా, ఏ మత గ్రంథాల లోతుల్లోకి శోధించినా ‘జ్ఞానం’ ప్రాముఖ్యత నిబిడీకృతమై ఉంటుందని ఆయా మతాల్లోని సారాంశాన్ని విశదీకరిస్తూ ఉద్బోధించారు. మానవ వనరులకు మరింత పదును పెట్టుకోవడమే ప్రస్తుతం మన ముందున్న అతి పెద్ద సవాల్ అని మానవ వనరుల అభివృద్ధి సంస్థకు సూచించారు. సరైన విద్యను అందించిన యువ భారతాన్ని జ్ఞాన సముపార్జన వైపు నడిపించగలిగితే, భారత్‌కు జనాభాయే అతి పెద్ద వనరవుతుందని అన్నారు. ‘నవ భారత నిర్మాణానికి ప్రభుత్వ, ప్రయివేట్ విద్యాసంస్థలు ఈ సదవకాశాన్ని సరైన దిశగా వాడుకోండి’ అని వెంకయ్య పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో సమున్నత జ్ఞాన తత్వాన్ని బోధించాలని వెంకయ్య ఆకాంక్షించారు. ‘మనం మన పిల్లలకు నాణ్యమైన, నైపుణ్యవంతమైన విద్య అందే అవకాశం కల్పిస్తే, భవిష్యత్ ప్రగతి వేగాన్ని అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదని వెంకయ్య ఉద్ఘాటించారు. ‘అయితే, దీనికి భిన్నంగా జరిగితే సంభవించే నష్టం కూడా అనూహ్యంగానే ఉంటుంది. భవిష్యత్ తరాలకు సరైన విద్యా పునాదులు వేయలేకపోతే, ప్రగతి పటంపైనుంచి భారత్ అంత వేగంగానూ కిందపడిపోయే ప్రమాదం ఉంది. నాణ్యమైన విద్యను అన్ని వర్గాలకు అందించలేకపోతే, అంతరాలు, ఆర్థిక అసమానతలు పెరిగి సమాజం ఛిన్నాభిన్నమవుతుంది’ అన్న విషయాన్ని గుర్తెరగాలని హెచ్చరించారు. అన్ని వర్గాలకు సమున్నత విద్యను అందించేందుకు కేరళలోని రౌజతుల్ ఉలూమ్ అసోసియేషన్ చేస్తున్న కృషి ప్రశంసార్హనీయమని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు కితాబునిచ్చారు.

చిత్రం..కోజికోడ్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడుకు జ్ఞాపికను బహూకరిస్తున్న దృశ్యం