జాతీయ వార్తలు

మార్చిలో కాంగ్రెస్ ప్లీనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ మహాసభలు దేశ రాజధాని ఢిల్లీలో మార్చి 16 నుంచి 18 వరకూ జరుగుతాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అనుభవం, యువ శక్తి, సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇవ్వటంతోపాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన శనివారం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. దేశంలోని అన్ని జిల్లాలు, రాష్ట్రాల నుండి పార్టీ కార్యకర్తలు ప్లీనరీకి హాజరవుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం శనివారం రాత్రి విలేఖకరులకు తెలిపారు. కాంగ్రెస్ నూతన దశ, దిశకు ఈ సమావేశాల్లో అంకురార్పణ జరుగుతుందని రాహుల్ ప్రకటించినట్టు తెలిపారు. రాహుల్ గాంధీ మూడు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడారని, ఆఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సీనియర్ నాయకుల అనుభవం, యువత ఉత్తేజానికి ప్రాధాన్యత ఉండాలని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాలకు అధిక ప్రాదాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని సుర్జేవాలా చెప్పారు. దేశంలోని కోట్లాది మంది యువతకు ఉపాధి కల్పించటం, సమస్యల సుడిగుండంలో ఉన్న వ్యవసాయరంగానికి అవసరమైన చేయూత ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ కార్మికులకు వారి హక్కులు కల్పించటం తప్పనిసరి అని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న కఠిన సవాళ్ల గురించి కూడా రాహుల్ గాంధీ చర్చించారని ఆయన చెప్పారు. దేశ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అనుసరించే విధానాన్ని పార్టీ ప్లీనరీలో చర్చించి ప్రజలకు ఒక సందేశం పంపిస్తారన్నారు. ప్లీనరీ సమావేశాల ద్వారా దేశంలోని నలుమూలల ఉన్న పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన సందేశం పంపాలని రాహుల్ గాంధీ సూచించారని సుర్జేవాలా చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన వేలాది కోట్ల కుంభకోణం గురించి కూడా సమావేశంలో చర్చ జరిగిందనీ,, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కుంభకోణంపై దేశానికి జవాబు చెప్పాలని స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. బ్యాంకింగ్ పర్యవేక్షణ వ్యవస్థ ఎలా విఫలమైందని సుర్జేవాలా ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో క్రోనీ పెట్టుబడిదారులు పెరిగిపోయారని స్టీరింగ్ కమిటీ దుయ్యబట్టింది. అవినీతి పట్ల శూన్య సహన విధానాన్ని అవలంభిస్తామని ప్రకటించిన మోదీ ప్రభుత్వం అవినీతిపరులకు పెద్ద పీట వేసిందని స్టీరింగ్ కమిటీ దుయ్యబట్టింది. బి.జె.పి ప్రభుత్వం వౌనం వహించటం వల్లనే కోట్ల కొలది ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేశం విడిచివెళ్లిపోయారని స్టీరింగ్ కమిటీ ఆరోపించింపి. నరేంద్ర మోదీ ఈ కుంభకోణాలపై ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద కుంభకోణం ఆడిటర్లు, దర్యాప్తు సంస్థల దృష్టి, ఆర్‌బీఐ దృష్టిని ఎలా తప్పించుకున్నదనేది మోదీ దేశానికి చెప్పాలన్నారు. బ్యాంకుల కుంభకోణంపై 2015లోనే వచ్చిన ఫిర్యాదులపై ప్రధాన మంత్రి కార్యాలయం ఎలాంటి చర్చలు తెసుకున్నదనేది ప్రజలకు వివరించాలన్నారు. బ్యాంకుల్లో ప్రజల సొమ్ముకు ఎలాంటి భద్రత ఉన్నదనేది కూడా ప్రజలకు వివరించాలని స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే బ్యాంకు కుంభకోణాలకు మూలమైన ఎల్.ఓ.యులను సుర్జేవాలా విడుదల చేశారు. మొత్తం 11 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ ఎల్.ఓ.యులు 2017, 2018లో విడుదల అయ్యాయని ఆయన చెప్పారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు విడుదల చేసిన ఒక్క ఎల్‌ఓయూ కూడా కనిపించలేదని స్పష్టం చేశారు.

చిత్రం..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన సోనియాగాంధీ, మన్మోహన్, ఇతర సీనియర్ నాయకులు