జాతీయ వార్తలు

కాళేశ్వరం అనుమతులపై ఎన్జీటీ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరు చేసిన పర్యావరణ అనుమతులపై తెలంగాణ, మహారాష్ట్ర, కేంద్రానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరైన అటవీ, పర్యావరణ అనుమతులు చెల్లవని, ఎలాంటి అధ్యయనం చేయకుండా హడావిడిగా అనుమతులు ఇచ్చారని, ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏన్జీటీలో సోమవారం పిటిషనర్ అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ జావేద్ రహీంతో కూడిన బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదనలు వినిపిస్తూ అనుమతుల మంజూరులో కేంద్ర జల వనరుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, భూగర్భ జల వనరుల శాఖ ఎటువంటి అధ్యయనం జరపలేదని వాదించారు. ఈ అప్పీల్‌పై మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్రానికి, తెలంగాణ, మహారాష్టల్రకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది.
పాలమూరు-రంగారెడ్డిపై విచారణ వాయిదా
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై చెన్నై ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్లను ఢిల్లీ ఏన్జీటీకి బదలాయించారు. దీనికి సంబంధించిన రికార్డులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఈ తదుపరి విచారణను మార్చి 13కి ఏన్జీటీ వాయిదా వేసింది.