జాతీయ వార్తలు

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఘడిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా సుపరిపాలన అందించేందుకు, ఐటీ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ఆరోగ్యరంగంలో సంస్కరణలు అమలు చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఆరోగ్య పరిరక్షణ, సేవల రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రైవేటు సంస్థలు, ఆరోగ్యరంగంలోని పరిశ్రమలు, ఆరోగ్య పరిరక్షక సంస్థలు, రోగుల బృందాల భాగస్వామ్యంలో డిజిటల్ హెల్త్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో సోమవారం జరిగిన ‘గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్‌నర్‌షిప్’ సదస్సులో ఆయన ప్రసంగించారు. మెరుగైన వైద్యసేవలు అందించడం, ఆరోగ్యం, ఆరోగ్య పరిరక్షణ విషయంలో లోపాలను ఎత్తిచూపేలా ప్రజలను చైతన్యపరచడం, ప్రభుత్వ వైద్య పథకాలు, వాటి నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం, సుపరిపాలన అనే నాలుగు అంశాల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం ద్వారా సంస్కరణలు అమలు చేయాలని భావిస్తున్నట్లు నడ్డా చెప్పారు. అలాగే ఇంటిగ్రేటెడ్ హెల్త్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, ప్రజారోగ్య నిర్వహణ, ఆస్పత్రుల సమాచారం, టెలి మెడిసిన్ వంటి విభాగాల్లో డిజిటిల్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నామన్నారు. భారత్ అధికారిక జాతీయ హెల్త్ పోర్టల్‌కు ప్రజాదరణ అద్భుతంగా ఉందన్న నడ్డా, ఈ పోర్టల్‌ను ఇప్పటివరకు 2.6 మిలియన్ల మంది ఉపయోగించుకున్నారని, 2.2 మిలియన్ల ఫోన్ కాల్స్ చేశారని చెప్పారు. ఆరు భారతీయ భాషల్లో పోర్టల్‌లో సమాచారం అందిస్తున్నామని, మరో ఆరు భాషల్లో ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని నడ్డా చెప్పారు. భారత్‌లోని 130 కోట్ల మందికి ‘ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్’ను రూపొందించేందుకు కంకణం కట్టుకున్నామని చెప్పారు. ఆస్పత్రులు, ఆరోగ్యసేవలు అందించే సంస్థలకు ఉచితంగా సాఫ్ట్‌వేర్, డేటా స్టోరేజ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిస్తుందని, తద్వారా ఆరోగ్యరంగంలో అభివృద్ధికి అందరూ సహకరించాలని నడ్డా పిలుపునిచ్చారు.