జాతీయ వార్తలు

ప్రధానికి‘నో’రూం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూరు, ఫిబ్రవరి 19: ప్రధాని నరేంద్ర మోదీకి నగరంలోని ప్రముఖ హోటల్ లలితా మహల్ ప్యాలెస్‌లో ఓ గది దొరకని పరిస్థితి ఎదురైంది. ప్రధాని, ఆయనతోపాటు వచ్చిన అధికార గణం బసచేసేందుకు గదులు ఖాళీ లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లో వివాహ విందుకోసం హోటల్‌లోని గదులన్నీ ఎప్పుడో రిజర్వ్ అయిపోయాయి. దీంతో చేసేదిలేక జిల్లా అధికార యంత్రాంగం మరో ఖరీదైన హోటల్‌లో మోదీ, ఆయన బృందానికి ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ‘ప్రధాని మోదీ, ఆయన సిబ్బందికి, భద్రతా అధికారులకు రూమ్‌లు బుక్ చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆఫీసును నుంచి ఆదేశాలు అందాయి. అయితే ప్రధానికి గదులు కేటాయించే పరిస్థితిలో మేం లేం. ఓ పెళ్లి విందుకోసం రూమ్‌లు అన్నీ ఎప్పుడో బుక్కయిపోయాయి’ అని లలితా మహాల్ ప్యాలెస్ జనరల్ మేనేజర్ మథియాస్ వెల్లడించారు. అంతమందికి సరిపడా గదులు లేవు, ఒకటి రెండు గదులు కేటాయించినా భద్రతాకారణాల వల్ల వీలుపడదని ఆయన చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే డీసీ ఆదేశాలను అమలుచేయలేకపోయామని ఆయన అన్నారు. లలితా మహాల్ ప్యాలెస్ నుంచి ఈ సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం పరుగులు పెట్టింది. దీంతో నగరంలోనే ఖరీదైన హోటల్ రెడీసన్ బ్లూలో మోదీకి బస ఏర్పాట్లు చేశారు. ఆయనతో వచ్చిన సిబ్బందికీ అందులోనే గదులు కేటాయించారు. హసన్ జిల్లాలో శ్రావణబెళగులలో ఆదివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ వచ్చారు. అలాగే నైరుతీ రైల్వే ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో, బీజేపీ ర్యాలీలో పాల్గొనే నిమిత్తం మోదీ ఇక్కడకు వచ్చారు.