జాతీయ వార్తలు

నవ భారతమే మన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, ఫిబ్రవరి 25: కుల,మత, అవినీతి రహిత నవ భారతాన్ని నిర్మించుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. సూరత్ నైట్ మారథాన్‌ను ప్రారంభించడానికి ముందు లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఆదివారం జరిగిన భారీ సభలో మోదీ మాట్లాడారు. యావత్ ప్రపంచం భారత దేశ ప్రాముఖ్యతను గుర్తిస్తోందని, ఇలాంటి తరుణంలో మన లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. కుల, మత సంఘర్షణలకు అతీతమైన భారతావని సాధనే దేశ ఖ్యాతిని మరింత పెంచుతుందని అన్నారు. నవభారతంలో అవినీతికి ఏ విధంగానూ ఆస్కారం ఉండకూడదన్నారు. అలాగే యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేరేదిగా, మహిళలకు పూర్తి న్యాయం, భద్రత, గౌరవం కలిగించేదిగా సరికొత్త భారతం ఉండాలని మోదీ అన్నారు. పేదరికాన్ని తరికొట్టాలని, పరిశుభ్రతకు విశేషమైన ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అలాంటి భారతావని నిర్మాణమే ధ్యేయంగా, లక్ష్యంగా ఈ మారథాన్ సాగుతోందని తెలిపారు. మరో నాలుగేళ్లలో అంటే 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయని, అప్పటికల్లా నిర్దేశిత లక్ష్యాలను సాధించుకునేలా ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని మోదీ అన్నారు.