జాతీయ వార్తలు

ఆధ్యాత్మిక శిఖరం భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరోవిల్లే (తమిళనాడు), ఫిబ్రవరి 25: యుగయుగాలుగా యావత్ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక మూలకేంద్రంగా కొనసాగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భిన్న సంస్కృతుల మేలుకలయికగా భిన్న మతాల సమాహారంగా పరస్పర గౌరవ భావాలకు సహజీవనానికి భారతదేశం నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందుతున్న గొప్ప మతాలు భారత్‌లోనే వేళ్లూనుకున్నాయని, వాటి స్ఫూర్తితోనే భిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ఆధ్యాత్మిక పథాన్ని అనుసరించారని మోదీ తెలిపారు. పాండిచ్చేరికి ఆరు కిలోమీటర్ల దూరంలోని ఈ అంతర్జాతీయ టౌన్‌షిప్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆదివారం మాట్లాడిన మోదీ ‘మానవ ఐక్యత సాధనకు విశ్వజనీన నగరంగా ఇది ఖ్యాతినొందింది’ అని పేర్కొన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక నాయకత్వానికి సంబంధించి అరబిందో చేసిన ఉద్బోధనలు, ఆయన దార్శనికత నేటికీ విస్తృత ప్రభావాన్ని కనబరుస్తోందని మోదీ తెలిపారు. అరబిందో దృక్పథానికి, ఆధ్యాత్మిక ఆలోచనా సరళికి ఈ అంతర్జాతీయ టౌన్‌షిప్ నిదర్శనమని పేర్కొన్నారు. గత ఐదు దశాబ్దాలుగా ఈ టౌన్‌షిప్ సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక, ఆధ్యాత్మిక విమోచనకు బలమైన కేంద్రంగా భాసిల్లుతూ వస్తోందని మోదీ తెలిపారు. వసుధైక కుటుంబమన్న భారతీయ భావనకు ఇది ప్రతీక అని, 1968లో ఈ అంతర్జాతీయ టౌన్‌షిప్ ప్రారంభమైందని అప్పట్లో 124 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. తాజా వివరాలను బట్టి 49 దేశాలకు చెందిన 2400మంది ఇక్కడ నివసిస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు.

చిత్రాలు..పాండిచ్చేరి సమీపంలోని అరోవిల్లే అంతర్జాతీయ టౌన్‌షిప్‌లో మాత్రై మందిరాన్ని సందర్శించిన ప్రధాని. *అరవిందుని సమాధి వద్ద నివాళులర్పిస్తున్న నరేంద్ర మోదీ.