జాతీయ వార్తలు

ఎవరు గొప్పో మీరే తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి, ఫిబ్రవరి 25: ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశాన్ని 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ విజయాలతో 48 నెలల ఎన్డీయే సర్కారు సాధించిన అభివృద్ధిని మేధావులు పోల్చిచూడాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరిలో ఆదివారం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేశాన్ని 48 ఏళ్లు కాంగ్రెస్ పాలించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చి మేనాటికి 48 నెలలు పూర్తిచేసుకోబోతోంది. ఈ దశలో కాంగ్రెస్ సాధించిన అభివృద్ధితో ఎన్డీయే సాధించిన అభివృద్ధిని మేధావులు, విజ్ఞులు పోల్చి చూడాల్సిన తరుణం వచ్చింది’ అన్నారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాలను మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ గత పాలనను తూర్పారబడుతూ ‘కాంగ్రెస్ దుస్థితికి ఎలాంటి సౌకర్యాలులేని పుద్దుచ్చేరి అద్దంపడుతోంది’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కర్నాటక తదితర రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమంటూనే, ఆ తరువాత నారాయణ స్వామి నేతృత్వంలోని పుదుచ్చేరి ఒక్కటే కాంగ్రెస్ ఏలుబడిలో ఉంటుందన్నారు. అయితే, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పాలనలోని పంజాబ్‌ను మోదీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ‘నేను ముఖ్యమంత్రి వి నారాయణ స్వామిని అభినందిస్తున్నా. ఎందుకంటే, కాంగ్రెస్ తన గురించి చెప్పుకోవడానికి ఇక ఆయనే మిగిలారు’ అంటూ ప్రధాని వ్యంగ్యోక్తులు విసిరారు. కాంగ్రెస్ ఏలుబడిలోని పుదుచ్చేరిలో కనీస సౌకర్యాలు మృగ్యమయ్యాయని, రవాణా వ్యవస్థ, సహకార వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని దుయ్యబట్టారు. ‘పుదుచ్చేరి అభివృద్ధిపర్చటంలో కాంగ్రెస్ అన్నివిధాలా విఫలమైంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.

చిత్రం..పాండిచ్చేరి ప్రధాని రాక సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కటౌట్ వద్ద బీజేపీకి అనుకూలంగా నినాదాలిస్తున్న మహిళలు