జాతీయ వార్తలు

చైనా భాషపై సైనికుల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఇండియా-చైనా సరిహద్దుల్లో పనిచేస్తున్న భారత్ సైనికులు చైనా అధికార భాష మాండరీస్‌ను నేర్చుకుంటున్నారు. అలాగే దేశలోని విద్యార్థులు కూడా ఈ భాషను నేర్చుకొనేందుకు అసక్తి చూపుతున్నారు. గతంలో చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) చైనా సైనికులతో సంప్రదింపులు చేసే సమయంలో భాష సమస్య వల్ల అనేకసార్లు ఇరు దేశాల సైనికుల మధ్య సమస్యల జఠిలం అవుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చైనా సరిహద్దులో పనిచేసే సైనికులు మాండరీస్ భాష నేర్చుకోవాలని హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సూచించారు. మధ్యప్రదేశ్‌లోని సాంచి యూనివర్సిటీలోని బుద్ధిస్ట్ స్టడీస్ విభాగం చైనా భాషలో ఏడాది సర్ట్ఫికెట్ కోర్సును అందిస్తోంది. ఈ సిలబస్‌ను హిందీ, ఇంగ్లీస్, చైనా భాషల్లో అందుబాటలో ఉంచారు. మూడు భాషల్లో సులభంగా అర్థమయ్యే విధంగా సిలబస్‌ను అందుబాటులో ఉంచినట్టు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ సర్ట్ఫికెట్ కోర్సును ఇద్దరు ఐటీబీపీ ఇన్‌స్పెక్టర్లతోపాటుగా మరికొంతమంది సైనికులు కూడా పూర్తి చేశారు. ఈ కోర్సును నేర్చుకోనేందుకు 20కి పైగా జవాన్లు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఇండో-చైనా సరిహద్దు ప్రాంతాల్లోని బౌద్దులతో మమేకం కావడానికి ఇది సహరిస్తుందని ఆ అధికారి అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న సాంచి స్తూపం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో చైనా భాషలో సర్ట్ఫికెట్ కోర్సు అందిస్తుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజేశ్ గుప్తా తెలిపారు. త్వరలోనే చైనా భాషకు సంబంధించిన అడ్వాన్స్‌డ్ కోర్సులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ భాషను నేర్చుకునేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.