జాతీయ వార్తలు

ఆధార్ గడువు నిరవధికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లతో ఆధార్ అనుసంధానం గడువును సుప్రీం కోర్టు పొడిగించింది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లతో అనుసంధానం తుది తీర్పు వెలువడే వరకూ చేసుకోవచ్చని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. వాటికి ఆధార్ లింక్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం వెల్లడించింది. ఆధార్ నంబర్ తప్పనిసరి అంటూ వత్తిడి తీసుకురావద్దని ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. సంక్షేమ పథకాలు, బ్యాంక్, మొబైల్ ఫోన్లకు ఆధార్ లింక్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. 12 అంకెల యూనిక్‌ఐటీ నంబర్ అనుసంధానికి ఈనెల 31 గడువువిధించారు. పిటిషన్లను విచారించిన ధర్మాసనం గడువును నిరవధికంగా పొడిగించింది. అయితే సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరని సుప్రీం స్పష్టం చేసింది.