జాతీయ వార్తలు

నమహో నాసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: భూమీద సకల జీవకోటి ధైర్యంగానే ఉన్నా, మట్టిగోళానికి మాత్రం అనుక్షణం ముచ్చెమటలు పడుతూనే ఉన్నాయి. కారణం విశ్వం నుంచి భూగ్రహం వైపు దూసుకొచ్చే శకలాలు. ఏక్షణంలో ఏ ఆస్టరాయిడ్ తన ఉనికిని ప్రదర్శిస్తుందో, భూమిని తాకి ఎంతటి విపత్తు సృష్టించనుందోనన్న భయాందోళన మట్టిగోళానికి మామూలే. భూమికి విశ్వం నుంచి ఆస్టరాయిడ్ల రూపంలో పొంచివున్న ముప్పు కొత్తేమీ కాకపోవచ్చు. భూ ఆవిర్భావం నుంచీ అనేక ఆస్టరాయిడ్లు భూమిని భయపెడుతూ పక్కనుంచి వెళ్లిపోయి ఉండొచ్చు. అయితే, నిస్తేజంగా ఇటువంటి ప్రమాదాన్ని చూస్తూ కూర్చునేకంటే, వాటిని ఎదుర్కొనే ప్రత్నామ్నాయ శక్తిపై దృష్టి పెట్టాలని నాసా ఎప్పటినుంచో యోచిస్తోంది. ఆ యోచన నుంచి పుట్టిందే మహాశకే హేమర్. నాసా రూపొందించిన అద్భుత స్పేస్ క్రాఫ్ట్. భూమివైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్లను ముందే పసిగట్టి ధ్వంసం చేయడానికి సిద్ధమైన వజ్రాయుధమే హేమర్ స్పేస్ క్రాఫ్ట్. హైపర్ వెలాసిటీ ఆస్టరాయిడ్ మిటిగేషన్ మిషన్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ (హెచ్‌ఎఎంఎంఇఆర్)గా రూపొందిన స్పేస్‌క్రాఫ్ట్‌ను నాసా, అమెరికా జాతీయ భద్రతా విభాగం, అమెరికా ఇంధన విభాగంలోని ఆయుధ ప్రయోగశాల సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించాయి. ఈ స్పేస్‌క్రాఫ్ట్ రెండు రకాలుగా భూరక్షణకు సేవలు అందించనుంది. భూమివైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్‌ను ముందుగానే పసిగట్టి దూరంగా నెట్టివేయడం ఒకటైతే, ఆస్టరాయిడ్‌ను తన న్యూక్లియర్ శక్తిని విచ్ఛిన్నం చేయడం రెండోది. ప్రతి ఆరేళ్లకోసారి భూమికి సమీపంలోకి వచ్చి భయపెట్టే బెన్ను ఆస్టరాయిడ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను నాసా రూపొందించినట్టు చెబుతున్నారు. అందుకు కారణం, 2035లో బెన్ను ఆస్టరాయిడ్ ఇటు భూమి, అటు చంద్రుడి మధ్యనుంచి ప్రయాణించే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో భూమికి బెన్నునుంచి ఎలాంటి ఉత్పాతం తలెత్తకుండా చూసే ఉద్దేశంతోనే ‘హేమర్’కు రూపకల్పన చేసినట్టు నాసా చెబుతోంది.