జాతీయ వార్తలు

నేను పూర్తిస్థాయి రాజకీయవేత్తను కాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుషికేష్, మార్చి 13: హిమాలయాల్లో రెండు వారాల ఆధ్యాత్మిక పర్యటనకు వచ్చిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాను ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుణ్ని కాదని స్పష్టం చేశారు. ‘ఇప్పటికైతే నేను కొత్త రాజకీయ పార్టీని ప్రకటించలేదు. కాబట్టి రాజకీయాల గురించి నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ప్రస్తుతానికి నేను పరిపూర్ణ రాజకీయవేత్తను కాదు’ అని రజనీ అన్నారు. ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌లో దయానంద సరస్వతి ఆశ్రమంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరికొద్ది రోజులు ఇక్కడే ఉండి యోగా చేస్తానని వెల్లడించారు. మక్కల్ నీతి మయం వ్యవస్థాపకుడు కమల్ హసన్ సోమవారం చేసిన వ్యాఖ్యలు మీడియా ఆయన దృష్టికి తీసుకురాగా రాజకీయ అంశాలపై తానేమీ మాట్లాబోనని అన్నారు. తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం ఖాయమని, 2021 ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాలకు పోటీచేస్తానని డిసెంబర్ 31న రజనీ గతంలో వెల్లడించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే విషయమై ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు రజనీకాంత్ హిమాలయాలకు వస్తుంటారు. దశాబ్దకాలం పైగా ఈ సంప్రదాయం నడుస్తోంది. రుషికేష్ వచ్చి ఇక్కడి నుంచి ధర్మశాల వెళ్తారు. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూలోని శివ గుహల్లో పర్యటిస్తారు. అయితే హిమాలయాల్లో పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రజనీకాంత్ వివరించారు. పైగా ఇక్కడకు రావడం కొత్తకాదన్న రజనీ ‘మనసు ప్రశాంతత కోసం ఇక్కడ కొద్ది రోజులు గడిపి వెళ్తుంటాను’ అన్నారు.