జాతీయ వార్తలు

ఇక టీబీ విముక్త భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: క్షయవ్యాధి నిర్మూలనకు ప్రపంచ స్థాయిలో జరుగుతున్న కృషి విజయవంతం కాలేదని, ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దిశగా మన దృక్పథం మారాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి క్షయవ్యాధి (టీబీ) రోగికి గుర్తించిన తొలి దశలోనే ఉత్తమ చికిత్స అందించాలనే దిశగా ప్రభుత్వం సాగుతోందని, ఈ కృషిలో ప్రైవేటు ఆసుపత్రులను కూడా భాగస్వాములను చేస్తోందని ఆయన తెలిపారు. 2015 నాటికి దేశంలో క్షయవ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించడానికి ఉద్దేశించిన క్షయవ్యాధి విముక్త భారత్ (టీబీ-ఫ్రీ ఇండియా) క్యాంపెయిన్‌ను ప్రధాని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి విముక్త గ్రామాన్ని, పంచాయత్‌ను, జిల్లా, రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి అన్ని స్థాయిల్లో అన్ని రంగాలకు సంబంధించిన వారు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీబీ వ్యాధికి చికిత్స చేసే వైద్యులు, ఈ వ్యాధి నిర్మూలనకు ఇప్పటికే కృషి చేస్తున్న కార్యకర్తలు ఈ కృషిలో ప్రధాన పాత్ర పోషించగలరని ఆయన పేర్కొన్నారు. ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ, జాతి భవిష్యత్తుపై క్షయవ్యాధి ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆయన అన్నారు. ఈ అంటువ్యాధికి గురయిన వారిలో అత్యధికులు పేద ప్రజలేనని పేర్కొంటూ, వారి జీవితాలపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపుతున్న ఈ వ్యాధిని నిర్మూలించడానికి ప్రతి చర్య తీసుకోవడం జరుగుతుందని ఆయన ఇక్కడ జరిగిన ‘ఎండ్-టీబీ సమ్మిట్’లో మాట్లాడుతూ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పాతికేళ్ల క్రితమే క్షయవ్యాధిని అత్యవసరంగా నిర్మూలించవలసిన అవసరం ఉందని ప్రకటించిందని, అప్పటి నుంచి అనేక దేశాలు ఈ వ్యాధిని నిర్మూలించడానికి కృషి చేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికీ క్షయవ్యాధిని నిర్మూలించడంలో మనం విజయం సాధించలేదనేది క్షేత్ర స్థాయి వాస్తవమని ఆయన అన్నారు. పది నుంచి 20 ఏళ్ల తరువాత కూడా అనుకున్న ఫలితాలను సాధించలేక పోయామంటే, మన దృక్పథాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని, చేసిన కృషిని సమీక్షించుకోవలసిన అవసరం ఉందని, నూతన మార్గాలను కనుక్కోవడానికి ఇది దోహదపడుతుందని మోదీ అన్నారు. 2025 నాటికి దేశంలో క్షయవ్యాధి నిర్మూలనకు ఉద్దేశించిన జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక కింద కార్యకలాపాలు నిర్వహించడానికి టీబీ-ఫ్రీ ఇండియా క్యాంపెయిన్‌ను ప్రధాని ప్రారంభించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా టీబీ వ్యాధి నిర్మూలనకు గడువును 2030గా నిర్ణయించారు. అయితే, అంతకన్నా అయిదేళ్ల ముందే 2025 నాటికి భారత్‌లో టీబీని నిర్మూలించాలని మనం గడువు నిర్ణయించుకున్నామని నేను ప్రకటిస్తున్నాను’ అని మోదీ అన్నారు. దేశంలో క్షయవ్యాధిని నిర్మూలించడంలో రాష్ట్ర ప్రభుత్వాలది ప్రధాన పాత్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ మిషన్‌లో పాల్గొనాలని తాను అందరు ముఖ్యమంత్రులకు లేఖలు రాశానని ఆయన తెలిపారు.
చిత్రం..ఢిల్లీలో మంగళవారం క్షయవ్యాధి విముక్త భారత్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ