క్రైమ్/లీగల్

లాహోర్ పెళ్లికెళ్లాలి.. అనుమతి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: తాను లాహోర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కుమారుడు అభయ్ చౌతాలా చేసుకున్న అభ్యర్థనపై ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఓ పెళ్లికి హాజరుకావల్సి ఉందని, దానికి కోర్టు అనుమతి మంజూరు చేయాలని అభయ్ అభ్యర్థించారు. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ తన తీర్పును రిజర్వ్‌లో పెట్టారు. లాహోర్‌లో వివాహ వేడుకకు గురువారం వెళ్లి రెండు రోజుల్లో తిరిగి వస్తానని అభయ్ చౌతాలా తన పిటిషన్‌లో కోరారు. అయితే అభయ్ చౌతాలా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ న్యాయవాది వాదించారు. అభయ్ చౌతాలా, ఆయన తండ్రి ఓం ప్రకాశ్ చౌతాలా, సోదరుడు అజయ్ చౌతాలాపై తీవ్రమైన అక్రమార్జన కేసులున్నాయని సీబీఐ తెలిపింది. ప్రయాణానికి ముందురోజే అనుమతి పిటిషన్ దాఖలు చేయడం వెనక దురుద్దేశం ఉందని సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్‌గుప్తా ఆరోపించారు. హడావుడి పిటిషన్‌ను పరిగణనలోనికి తీసుకోవద్దని న్యాయమూర్తిని కోరారు.