జాతీయ వార్తలు

మళ్లీ అదే వరస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వేసిన ఎత్తు మూలంగా మంగళవారం కూడా తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాలేదు. టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్దకు వచ్చి చేసిన గొడవ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాక్‌లో మరణించిన భారతీయుల గురించి ప్రకటన చేయకుండా కాంగ్రెస్, ఎంఐఎం, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాలు చేసిన గొడవ మూలంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టటం సాధ్యం కాలేదు. ఇరక్‌లోని ముసూల్‌లో ఐఎస్‌ఐఎస్ ఇస్లామిక్ ఉగ్రవాదులు హత్య చేసిన భారతీయుల గురించి లోక్‌సభలో ప్రకటించేందుకు ప్రతిపక్షం అంగీకరించకపోవటం సిగ్గుచేటు, అమానుషమంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ విమర్శలు గుప్పించారు. భారతీయుల మరణానికి సంబంధించిన ప్రకటనను కూడా అడ్డుకోవటం ద్వారా అమానుషంగా వ్యవహరించారు.. మానవత్వాన్ని వదిలివేశారు.. ఇది ఇత్యంత విచారకరం అంటూ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ మంగళవారం
ఉదయం పదకొండు గంటలకు సమావేశమైనప్పుడు టీఆర్‌ఎస్, అన్నా డీఎంకే తదితర పార్టీల సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టకుండా నినాదాలతో అడ్డుకున్నారు. రెండు పార్టీల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఇచ్చిన నినాదాలతో సభ దద్దరిల్లింది. దీనితో సుమిత్రా మహాజన్ సమావేశం ప్రారంభమైన నిమిషానికే మధ్యాహ్నం పనె్నండు గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు ఇరాక్‌లో మూడేళ్ల క్రితం ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన భారతీయుల గురించి ప్రకటన చేసేందుకు సుష్మా స్వరాజ్‌కు అనుమతిచ్చారు. సుష్మా స్వరాజ్ ప్రకటన చేసేందుకు లేవగానే కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ సీట్లలో నిలబడి తీవ్రస్థాయిలో గొడవ చేశారు. అవిశ్వాస తీర్మానం ఉండగా సుష్మాతో ప్రకటన ఎలా చేయిస్తారని వారు ప్రశ్నించారు. భారతీయుల మరణానికి సంబంధించిన ప్రకటన కూడా చేయనివ్వరా? ఎందుకింత అమానుషంగా వ్యవహరిస్తున్నారు? అంటూ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 39 మంది భారతీయుల మరణానికి సంబంధించిన ఈ ప్రకటనను గొడవ, గందరగోళం మధ్య చేయటం తనకు ఇష్టం లేదని సుష్మా స్వరాజ్ తెలిపారు. వారందరినీ ఐఎస్‌ఐఎస్ హత్య చేసినట్లు రుజువైనందున ప్రకటన చేసేందుకు సభకు వచ్చానని సుష్మా వివరించారు. అయితే ప్రతిపక్షం మాత్రం ఆమె మాట్లడేందుకు అనుమతించలేదు. కాంగ్రెస్‌తోపాటు మొత్తం ప్రతిపక్షమంతా లేచి నిలబడి అరుస్తూ సభా కార్యక్రమాలకు అడ్డం పడ్డారు. అప్పటికే పోడియం వద్దకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నా డీఎంకే సభ్యులు ఇచ్చిన నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. సుష్మాతో ప్రకటన చేయించేందుకు పడుతున్న తాపత్రయాన్ని అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరిపించేందుకు ఎందుకు చూపించటం లేదని ప్రతిపక్షం స్పీకర్‌ను ప్రశ్నించింది. ఇరాక్‌లో హత్యకు గురైన భారతీయుల పట్ల మీకు ఎలాంటి భావాలు లేవా.. ఇలాంటి రాజకీయం మంచిది కాదని సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. ఆ తరువాత వివిధ స్టాండింగ్ కమిటీల నివేదికలను సభకు సమర్పింపజేశారు. అనంతరం తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాల గురించి ప్రకటించారు. మీరంతా వెళ్లి సీట్లలో కూర్చుంటే బాగుంటుందని సుమిత్రా మహాజన్ అన్నా డీఎంకే, టీఆర్‌ఎస్ ఎంపీలకు సూచించారు. సభ ఆర్డర్‌లో లేనందున అవిశ్వాస తీర్మానాలను చర్చకు చేపట్టలేనని పలుమార్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేయగానే అన్నా డీఎంకే, టీఆర్‌ఎస్ సభ్యులతోపాటు మొత్తం ప్రతిపక్ష సభ్యులంతా నినాదాలివ్వడంతో సభ పూర్తిగా స్తంభించిపోయింది. దీనితో సుమిత్రా మహాజన్ సభను బుధవారం ఉదయం పదకొండు గంటలకు వాయిదా వేశారు.

*
విశ్వాసమవిశ్వాస మె
గశ్వాసగనుగ్గబట్ట గందరగోళమ్
నిశ్వాసల నిట్టూర్పుల
నశ్వరవౌ రాజకీయ నటనలు జూడుమ్!
*
చిత్రం..లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్