జాతీయ వార్తలు

ఇన్నాళ్లూ ఎందుకు దాచారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రవాదుల ఊచకోతకు గురైన 39 మంది భారతీయుల కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. 2014లో ఐఎస్ బందీలుగా ఉన్నప్పటికీ ఇవేళొస్తారు.. రేపొస్తారంటూ కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో వారిక లేరన్న వార్త బాధిత కుటుంబాల్లో కల్లోలం రేపింది. అయితే ఉగ్రవాద ముష్కరులకు బలైపోయారని తెలిసినా ప్రభుత్వం ఇంతకాలం తమను చీకట్లో ఉంచిందని వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘గుండెలను పిండేసే విషాద వార్త మాకెందుకు చెప్పలేదు. కేంద్రం ఎందుకు రహస్యంగా ఉంచింది?’ అంటూ వారు నిలదీశారు. 39 మంది చనిపోయారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ప్రకటన టీవీల్లో చూసిన బంధువులు హతాశులయ్యారు. ఏ ప్రభుత్వం సంస్థా బందీలు చనిపోయినట్టు వెల్లడించకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారిలో పంజాబ్‌కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 39 మందీ మరణించారని, 38 మంది డీఎన్‌ఏలు సరిపోలినట్టు పార్లమెంటుకు తెలిపారు. ఒకరి డీఎన్‌ఏ 70 శాతం జతకలిసిందని ఆమె వెల్లడించారు. అయితే దుర్వార్తను కుటుంబ సభ్యులకంటే ముందు పార్లమెంటుకు వెల్లడించడానికి గలకారణాలపై మంత్రి వివరణ ఇచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం అలా చేయాల్సి వచ్చిందని సుష్మా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ తీరును బాధిత కుటుంబాలు నిరసించాయి. ‘ఇంతకాలం మా సోదరుడు వస్తాడన్న ఆశతో ఉన్నాం. ప్రభుత్వం మాకు చెప్పకుండా మభ్యపెడుతూ వచ్చింది’ అని శర్వాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శర్వాన్ సోదరుడు 31 ఏళ్ల నిషాన్‌ను ఐఎస్ ముష్కరులు పొట్టనబెట్టుకున్నాయి. కేంద్ర ఇన్నాళూ తమను చీకట్లో ఉంచిందని అమృత్‌సర్‌కు చెందిన అతడు ఆవేదనగా చెప్పాడు. నాలుగేళ్ల తరువాత దిగ్భ్రాంతికర వార్త చెప్పారని శర్వాన్ అన్నాడు. ‘విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను పది పనె్నండు సార్లు కలిశాం. మాకున్న సమాచారం ప్రకారం 39 మంది క్షేమంగా ఉన్నారని ఆమె అన్నారు. తీరా ఇప్పుడు మరణించారని అంటున్నారు’ అని అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరాక్‌లో అదృశ్యమైన భారతీయుల గురించి కేంద్ర వద్ద స్పష్టమైన సమాచారం లేదని, దీన్ని కప్పిపుచ్చుకోడానికి వారంతా క్షేమంగా ఉన్నారని ఇన్నాళ్లూ తప్పుదోవపట్టించారని బాధిత కుటుంబాలు ధ్వజమెత్తాయి. తమ సోదరుడు 2014 జూన్ 21న ఫోన్లో తమతో మాట్లాడాడని అదే ఆఖరి అయిపోయిందని శర్వాన్ వాపోయాడు.
ఈ విషయంలో కేంద్ర ఘోరంగా విఫలమైందని వారు విరుచుకుపడ్డారు. తమవారి యోగక్షేమాల గురించి అడగడానికి మంత్రిని కలవాలని అనేక సార్లు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయిందని చివరికి ఈ విషాదం వార్త వినాల్సి వచ్చిందని గురిపీందర్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. కౌర్ సోదరుడు 27 ఏళ్ల మంజీందర్ సింగ్ చనిపోయిన 39 మందిలో ఒకడు. ఇప్పటి వరకూ బందీలంతా క్షేమంగా ఉన్నారన్న కేంద్రం ఆకస్మాత్తుగా చనిపోయారని చెప్పడం దారుణమని ఆమె విమర్శించారు. కపుర్తలాలోని మురార్ గ్రామానికి చెందిన గోవిందర్ సింగ్ ఐఎస్ ముష్కరులకు బలైపోయాడు. అతడి కుటుంబ సభ్యులూ కళ్లలో వత్తులు పెట్టుకుని రాకకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇరాక్‌లో 39 మంది ఊచకోతకు గురయినట్టు టీవీల్లో వార్తలు చూసి గోవిందర్ సింగ్ కుటుంబ షాక్‌కు గురైంది.‘కేంద్ర విదేశాంగ శాఖ కనీస సమాచారం ఇవ్వలేదు. పార్లమెంట్‌లో సుష్మాస్వరాజ్ ప్రకటన చూసి దిగ్భ్రాంతికి గురయ్యాం’అని గోవిందర్ సింగ్ అన్న దేవిందర్‌సింగ్ తెలిపాడు.

చిత్రం..ఐసిస్ ఉగ్రవాదుల ఊచకోతకు బందీలు బలైపోయారన్న వార్త తెలిసి అమృత్‌సర్‌లో కన్నీరుమున్నీరవుతున్న ఓ బాధిత కుటుంబం