జాతీయ వార్తలు

ప్రభుత్వానిదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కావేరీ నదీ జలాల బోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యసభలో ఎంపీలు నిరసన తెలపడంతో సభ బుధవారానికి వాయిదా పండింది. మంగళవారం సభ ప్రారంభమైన అనంతరం చైర్మన్ వెంకయ్య నాయుడు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పింపజేశారు. అనంతరం ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన 39 మంది భారతీయులు చనిపోయినట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సభలో ప్రకటన చేశారు. తరువాత టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మీ, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోడియం వద్దకు వచ్చి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాసహా విభజన హామీలను అమలు చేయాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మరోవైపు అన్నాడీఎంకే, డీఎంకే ఎంపీలు కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ప్రస్తుతం సభ సజావుగా జరగకపోవడానికి ప్రభుత్వమే కారణామని ఆరోపించారు. వివిధ సమస్యలపై సభలో ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సభలో ఆందోళనలను అదుపుచేసి సభ సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. కొన్ని రోజులుగా ప్రధానంగా మూడు అంశాలపై సభలో ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, జాతి ప్రయోజనాలతో కూడిన బ్యాంకింగ్ లోపాలు, కావేరీ బోర్డు ఏర్పాటు అంశాలపై సభలో నిరసన తెలుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వారితో చర్చించి సభకు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ అంశాలపై, బిల్లులపై, సమస్యలపై పది ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, సభ సజావుగా జరగాల్సిందేనని ఆజాద్ స్పష్టం చేశారు. ఈ సందర్భంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ గోయెల్ మాట్లాడుతూ సభలో బ్యాంకింగ్ రంగంలోని లోపాలు, ఏపీకి ప్రత్యేక హోదా, కావేరీ అంశంతోపాటుగా ఇతర అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. సభా కార్యకలాపాలు పక్కన బెట్టి ఈ అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ సమయంలో ఇలా ఎంపీలు పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులను చేతబట్టి నిరసన తెలిపితే సభను నడపలేనని చైర్మన్ వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఏపీ, తమిళనాడు ఎంపీల నిరసనలతో సభ బుధవారానికి వాయిదా పడింది.

చిత్రం..మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతున్న ఆజాద్