జాతీయ వార్తలు

అవిశ్వాసంపై భయమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని పార్లమెంట్ అవరణలో ఏపీకి చెందిన ఎంపీలు మంగళవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదాతోసహా, విభజన హామీలు అమలు చేయాలని ప్లకార్డులు చేతబట్టి నినాదాలిస్తూ నిరసనలను కొనసాగించారు. వినూత్న వేషధారణలో ప్రతిరోజూ నిరసన తెలుపుతున్న ఎంపీ శివప్రసాద్ విద్యార్థి వేషం కట్టి.. ఏపీకి నిధులివ్వకపోతే ‘మోదీ తాతాను కొట్టేస్తా’ అంటూ నిరసన తెలిపారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం తోట నరసిహం మాట్లాడుతూ అవిశ్వాసంపై మోదీ ప్రభుత్వం ఎందుకు బయపడుతోందని నిలదీశారు. బీజేపీ ఎంపీలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తాము పార్లమెంట్‌లో ప్రతిరోజూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తూనే ఉంటామని, సభలో చర్చ జరిగేంతవరకు పట్టు వీడేది లేదని స్పష్టం చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ నిరసన
పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శస్తూ మంగళవారం కూడా నిరసన తెలిపారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చర్చ జరిగే వరకు వదిలిపెట్టేది లేదని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు నోటీసులు ఇస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మేకపాటి రాజామోహన్ రెడ్డి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడానికి చంద్రబాబే కారణమని, ఆయన అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని రెండు మూడేళ్ల కొకసారి ఆయన భాగస్వామిని మారుస్తారని విమర్శించారు.
మాపై విమర్శలు సరికాదు: టీఆర్‌ఎస్
తమ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌లో నిరసనలను కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. మంగళవారం టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపాలా, బయట తమ నిరసనలను కొనసాగించారు. పార్లమెంట్ ప్రధాన ద్వారంవద్ద నిలబడి రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేతబట్టి ఆందోళన నిర్వహించారు. ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ ఎవరేమనుకున్నా పార్లమెంటు లోపలా, బయటా తమ నిరసనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వకపోవడంపై విమర్శలు సరికాదని, అవిశ్వాసం రాజకీయ స్వార్థంతో కూడిన అంశంగా అభివర్ణించారు. అవిశ్వాసానికి తాము మద్దతు ఇవ్వడం అంటే ‘పక్కింట్లో పెళ్లయితే మా ఇంటికి రంగులు వేసుకోవడమే’నని అలాంటి అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

చిత్రాలు....పార్లమెంటు ప్రాంగణంలో మంగళవారం నిరసన తెలుపుతున్న తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు