జాతీయ వార్తలు

దమ్ముంటే చర్చకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: కేంద్రానికి దమ్ము, ధైర్యం ఉంటే తాము లోక్‌సభలో ఇస్తున్న అవిశ్వాస తీర్మాన నోటీసులపై చర్చకు రావాలని టీడీపీ ఎంపీలు సవాల్ విసిరారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, అవంతి శ్రీనివాస్, మాగంటి బాబు, మురళీమోహన్ విలేఖరులతో మాట్లాడారు. కేంద్రానికి వ్యతిరేకంగా నాలుగోసారి అవిశ్వాస తీర్మానం ఇచ్చామని తెలిపారు. అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలతో సభ వాయిదా పడినట్టు చెప్పారు. తాము ఇస్తున్న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులపై చర్చ చేపట్టేవరకు పోరాటం చేస్తామని అన్నారు. తాము ఎన్ని నిరసనలు చేస్తున్న దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా కేంద్రం తీరు ఉందని ఎంపీలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీపై సోషల్ మీడియాలో ‘ఆపరేషన్ గరుడ’ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీలు చెప్పారు. అలాగే విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనను బుధవారం కూడా కొనసాగించారు. ఎంపీ శివప్రసాద్ సత్య హరిశ్చంద్రుడి వేషంలో పార్లమెంట్‌కి వచ్చారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్ ముఖ్యద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టేలా చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీకి బీజేపీ, టీడీపీ తీరని అన్యాయం చేశాయని ఆరోపించారు.
స్పీకర్‌ను కలిసిన టీఆర్‌ఎస్ ఎంపీలు
రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్రాలకు అప్పగించే విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు లోక్‌సభలో తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన విరమించాలని టీఆర్‌ఎస్ ఎంపీలకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల విషయమై పార్లమెంట్ లోపల, బయటా టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు.