జాతీయ వార్తలు

షరా మామూలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: లోక్‌సభలో నాలుగోరోజు కూడా తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మత్రివర్గంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నా డీఎంకే సభ్యులు పోడియం వద్ద నినాదాలతో గొడవచేస్తూ సభను స్తంభింపజేయటంతో అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు ప్రతిపాదించటం కష్టమైపోయింది. అవిశ్వాస తీర్మానాన్ని యాభైమంది సభ్యులు బలపరచవలసి ఉంటుంది, యాభైమంది బలపరుస్తున్నారా లేదా అనేది కూడా తనకు కనిపించటం లేదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. సభ ఆర్డర్‌లో లేదు కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు ప్రతిపాదించలేకపోతున్నానని సుమిత్రా మహాజన్ ప్రకటించారు. సుమిత్రా మహాజన్ ప్రకటనను ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. తాము నిలబడి ఉన్నా మీరు లెక్కించటం లేదు.. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు ప్రతిపాదించటం లేదని వారు విమర్శించారు. లోక్‌సభ బుధవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే అన్నా డీఎంకే, టీఆర్‌ఎస్‌తోపాటు బిహార్‌కు చెందిన జన అధికార పార్టీ ఏకైక సభ్యుడు రాజేష్ రంజన్ యాదవ్ (పప్పుయాదవ్) కూడా పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నా డీఎంకే సభ్యులు కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలంటే టీఆర్‌ఎస్ సభ్యులు ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలంటూ పెద్దఎత్తున నినాదాలిచ్చారు. వీరంతా ప్లకార్డులు ప్రదర్శించటమే కాకుండా వాటిని స్పీకర్‌కు అడ్డంపెట్టి నిరసన తెలిపారు. దీనితో సుమిత్రా మహాజన్ లోక్‌సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు సుమిత్రా మహాజన్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేసిన అనంతరం తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్‌తోసహా ప్రతిపక్ష సభ్యులంతా లేచి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఈ దశలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ లేచి అవిశ్వాస తీర్మానంతోపాటు ప్రతిపక్షం ప్రతిపాదించే ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. సభ అదుపులోకి వస్తే చర్చ ప్రారంభిస్తానని సుమిత్రా మహాజన్ అన్నారు. పోడియం వద్ద నిలబడి నినాదాలు ఇస్తున్నవారు తమ సీట్లలోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అయినా సభ అదుపులోకి రాకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.

మళ్లీ నోటీసులు

న్యూఢిల్లీ, మార్చి 21: తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి బుధవారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రెటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసులు అందజేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తూనే ఉంటామని వారు స్పష్టం చేశారు.