జాతీయ వార్తలు

అదే రభస.. రాజ్యసభ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: విపక్ష ఎంపీల ఆందోళనలతో బుధవారం కూడా రాజ్యసభ సజావుగా సాగలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, కావేరీ నదీ జలాల బోర్డు ఏర్పాటు, ఎస్సీ-ఎస్టీ ఆట్రాసిటీ అంశాలపై చర్చ జరగాలని ఎంపీలు నిరసనలతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభమైన అనంతరం చైర్మన్ వెంకయ్య నాయుడు వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సమర్పింపజేశారు. జీరో అవర్ ప్రారంభం కాగానే ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, తోట సీతారామలక్ష్మి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిచ్చారు. అన్నాడీఎంకే, డీఎంకే ఎంపీలు కావేరీ జలాలకు సంబంధించిన బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అంశం, ఇరాక్‌లో 39 మంది భారతీయులు ఐసిఎస్ ఉగ్రవాదులు ఘాతుకానికి బలైపోయిన అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వీటిపై చర్చకు నోటీసులు ఇవ్వాలని చైర్మన్ ఆజాద్‌కు సూచించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ దీన్ని తోసిపుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. ఈ పరిస్థితుల్లో సభను గురువారానికి వాయిదా వేయక తప్పలేదు.