జాతీయ వార్తలు

పెరియార్ విగ్రహం ధ్వసం కేసు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/న్యూఢిల్లీ, మార్చి 21: తమిళనాడులోని పుదకొట్టాయ్ జిల్లాలో ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామసామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ సెంథిల్‌కుమార్ (35) అనే సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌ను విధుర్తి గ్రామంలోని అతడి ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పతాగిన మైకంలో సంఘ సంస్కర్త పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఫుటేజ్‌ను పరిశీలించిన తరవాత హెడ్‌కానిస్టేబుల్ సెంథిల్ కుమార్‌ను అరెస్టు చేసినట్టు పుదుకొట్టాయ్ పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా సెంథిల్ నెల రోజులు సెలవుపెట్టి స్వగ్రామం వెళ్లాడని ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ వర్గాలు చెప్పాయి. పెరియార్ విగ్రహం ధ్వంసం ఘటన వెలుగుచూడడంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు వారు పేర్కొన్నారు. పెరియర్ విగ్రహం ధ్వంసం అంశం తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. ముఖ్యమంత్రి పళనిస్వామి దీనిపై ఓ ప్రకటన చేస్తూ చత్తీస్‌గఢ్‌లో ఉద్యోగం చేస్తున్న సెంథిల్‌కుమార్ మానసిక స్థితి సరిగ్గాలేనందున హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడని చెప్పారు. ఇటీవల సొంతూరు వచ్చాడన్నారు. అయితే తమ ఇంటి సమీపంలోనే పెరియార్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని 2013లోనే అతడు అభ్యంతరం తెలిపాడని సీఎం స్పష్టం చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ను పోలీసులు విచారించగా రామసామి విగ్రహాన్ని తానే ధ్వంసం చేసినట్టు అంగీకరించాడని పళని వెల్లడించారు.