జాతీయ వార్తలు

సీసీ కెమేరాలు ఆపేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనె్న, మార్చి 22: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి సంబంధించిన మిస్టరీ రోజుకో మలుపుతిరుగుతోంది. అసలు జయలలిత ఆసుపత్రి పాలుకావడానికి ముందు ఏం జరిగిందీ? ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటీ? దాదాపు75 రోజుల చికిత్స జరిగినా ఆమె కోలుకోవల్సింది పోయిన మరణించడానికి దారితీసిన అంశాలు ఏమిటన్నది ఇప్పటికీ అంతుపట్టకుండానే ఉంది. తాజాగా వెలుగుచూసిన మరో అంశం తీవ్ర దిగ్భ్రాంతినే కలిగిస్తోంది. జయలలిత ఆసుపత్రిలో ఉన్న 75 రోజుల పాటు సీసీటీవీ కెమెరాలను ఆపేశామని అందుకు కారణం ప్రతి ఒక్కరూ ఆమెను చూడకూడదని తాము భావించడమేనని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి గురువారం వెల్లడించారు. సీసీటీవీ కెమెరాలను ఆపేయడానికి కారణం 24 పడగల ఐసీయూలో జయ ఒక్కరే ఉండడమేనని ఆయన వివరించారు. జయ మరణానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ఏ అర్ముగస్వామి కమిషన్‌కు సంబంధిత అన్ని పత్రాలూ అందించామని రెడ్డి స్పష్టం చేశారు. 2016 సెప్టెంబర్ 16న అపోలోలో చేరిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అదే ఏడాది డిసెంబర్ 4న తీవ్రస్థాయిలో గుండెపోటుకు గురయ్యారు. ఆ మర్నాడే మరణించారు. ఏక సభ్య దర్యాప్తు కమిషన్‌కు సీసీటీవీ ఫుటేజీ కూడా అందించారా అన్న ప్రశ్నకు‘సారీ దురదృష్టవశాత్తూ జయకు చికిత్స జరిగిన 75రోజుల పాటు సీసీటీవీ కెమెరాలు ఆపేశాం. అలాగే ఐసీయూలోకి కూడా ఎవర్నీ అనుమతించలేదు. అప్పటికే అందులో ఉన్నవారిని మరో ఐసీయూకి తరలించాం’అన్నారు. జయను పరామర్శించడానికి తాము ఎవర్నీ అనుమతించలేదని తెలిపారు. తమ ఆసుపత్రికి సంబంధించి ఓ స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తామని, అత్యంత సన్నిహితులను తప్ప ఎవర్నీ అనుమతించమని, అదీ కాసేపే వారిని అక్కడ ఉంచుతామని రెడ్డి పేర్కొన్నారు. జయ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ఆమెను చూడడానికి ఎవర్నీ అనుమతించలేదని ఆయన పునరుద్ఘాటించారు. అయితే బంధువులు కోరిన పక్షంలో అక్కడున్న వైద్యుల అనుమతితో రోగులను చూసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. జయ ప్రాణాలు కాపడేందుకు తాము శతవిధాల ప్రయత్నించామని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున ఇంతకు మించి తానేమీ మాట్లాడలేనని అన్నారు. వార్డు బాయ్ నుంచి టెక్నీషియన్ల వరకూ, నర్సుల నుంచి డాక్టర్ల వరకూ ప్రతి ఒక్కరూ జయలలితను పూర్తిస్థాయిల సంరక్షించారని అన్నారు. ఇతర దేశాల నుంచి కూడా వైద్యులను రప్పించి ఆమె కోలుకోవాలన్న ఆశతో చికిత్స చేయించామని ఆయన స్పష్టం చేశారు. ఏక సభ్య కమిషన్ నుంచి తమకు సమన్లు అందినవెంటనే హాజరవుతామని అపోల్ చైర్మన్ వెల్లడించారు.