జాతీయ వార్తలు

సైనికుల పిల్లల విద్యకు అపరిమిత సహాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: యుద్ధంలో మరణించిన, గాయపడిన సైనికులు పిల్లలకు విద్యకోసం కేటాయించే నెలసరి మొత్తంపై విధించిన రూ.10,000 పరిమితిని కేంద్రం ఎత్తివేసింది. గత జూలైలో విధించిన ఈ పరిమితిని ఎత్తేయాలని సైన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోంది. ఎట్టకేలకు ప్రభుత్వం అందుకు తలొగ్గింది. ప్రభుత్వం విధించిన పరిమితిపై త్రివిధ దళాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ పరిమితిని ఎత్తేసినట్టు స్పష్టం చేసింది. అయితే ఈ రాయితీ ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తేనే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పనిచేసే స్వతంత్ర సంస్థల్లో కూడా ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. ఈ పథకాన్ని 1972లో కేంద్రం ప్రవేశపెట్టింది.