జాతీయ వార్తలు

రాజకీయ ప్రేరేపిత కేసుల ఉపసంహరణ పరిశీలిస్తున్న ఉత్తరప్రదేశ్ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 22: రాజకీయ ప్రేరేపిత కేసులను యోగి అదిత్యనాథ్ సర్కార్ ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అల్లర్లు రాజకీయ ప్రేరేపితమని తేలితే వాటిని ఉపసంహరించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నదని ఉత్తరప్రదేశ్ న్యాయశాఖ మంత్రి బ్రిజేష్ పాఠక్ గురువారం వెల్లడించారు.
రాష్ట్రంలోని ముజాఫర్ నగర్ తదితర ప్రదేశాల్లో చోటుచేసుకున్న అల్లర్లపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘కేసులు ఐపిసి కిందనే నమోదవుతాయి. ఒకవేళ అవి రాజకీయ ప్రేరేపితమైతే ఉపసంహరణకు తప్పనిసరిగా పరిశీలిస్తాం’ అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మేరకు, మేం తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ‘‘వివిధ పార్టీల నుంచి మాకు లేఖలు అందాయి. రాజకీయ వైరుధ్యం కారణంగా పెట్టిన కేసులను ఉపసంహరించాలని అవి కోరాయి’ అని తెలిపారు. ఇప్పటికే యుపి కోర్టుల్లో 62 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 2013 ముజఫర్ నగర్, షాలీల్లో జరిగిన మతఘర్షణలకు సంబంధించిన 131 కేసులను కూడా ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందన్న వార్తలపై విలేకర్లు ప్రశ్నించినప్పుడు మంత్రి సమాధానం దాటవేశారు. 2013 సెప్టెంబర్‌లోజరిగిన అల్లర్లలో మొత్తం 62 మంది మరణించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ హింసాకాండ నేపథ్యంలో 1,455 మంది వ్యక్తులపై 503 కేసులు నమోదయ్యాయి. అప్పటి సమాజ్‌వాదీ ప్రభుత్వం హయాంలో ఈ కేసులు రిజిస్టరయ్యాయి.
భాజపా మతపాలన చేస్తోంది: ఒవైసీ
ముజఫర్ నగర్ ఘర్షణలకు సంబంధించి 131 కేసులను ఉపసంహరించుకోవాలన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఖండనార్హమైందని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 50వేల కుటుంబాలు నిరాశ్రయులు కావడానికి కారకులైన వారిపై కేసులు ఎత్తేయాలనుకోవడం అమానుషమన్నారు. భాజపా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నదన్నారు. ఏ విధంగా వారు కేసులను ఉపసంహరిస్తారని ప్రశ్నించారు. ‘చట్టం ప్రకారం వారిని దోషులుగా నిలబెట్టాలి. కానీ భాజపా చట్టప్రకారం పాలన కొనసాగించడంలేదు. కేవలం మతపరమైన పాలన చేస్తున్నదన్నారు.