జాతీయ వార్తలు

2019 నాటికి మహాకూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: కేంద్రంలో మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా 2019 నాటికి గ్రాండ్ అలయెన్స్ (మహా కూటమి)ని ఏర్పాటు చేయనున్నట్టు జేడీ(యూ) మాజీ ఎంపీ శరద్ యాదవ్ ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం పోరాడడం ద్వారానే మతతత్వ బీజేపీని ఎండగట్టవచ్చని గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. ‘దేశంలో సామాజిక న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాడుతాం. అదొక్కటే బీజేపీ దూకుడును నిరోధిస్తుంది. సామాజిక న్యాయం అజెండాతోనే నేను దేశ వ్యాప్తంగా పర్యటించి బీజేపీ యేతర పార్టీల మద్దతు కూడగడతా. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి మహాకూటమి ఏర్పాటు చేస్తాన్న విశ్వాసం నాకుంది’ అని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్‌డీఏ కన్వీనర్‌గా పనిచేసినప్పటి అనుభవాలు ఓ వార్తా సంస్థతో ఆయన పంచుకున్నారు. ‘ఎన్‌డీఏ కన్వీనర్‌గా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఓ వేదికపైకి తీసుకొచ్చా. ఏబీ వాజపేయి, ఎల్‌కె అద్వానీ నాయకత్వంలో ఓ జాతీయ అజెండాతో ముందుకెళ్లాం. ఇప్పుడా పరిస్థితులు లేవు. దేశంలో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది’ అని ఆయన పేర్కొన్నారు. విభజించి పాలించు అన్న రీతిలో పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతప్రాతిపదికపై ప్రజలను విభజించి పాలిస్తోందని శరద్ యాదవ్ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆలయాలు చుట్టూ తిరుగుతూ రాజ్యాంగ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి ఏలా ఉంటుందన్న ప్రశ్నకు ‘మా ఆలోచనకు కార్యరూపం దాల్చనీయండి. తరువాత కూటమి అన్నది మాకు పెద్ద కష్టం కాదు. 11సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం నాది. అలాగే నాలుగుసార్లు రాజీనామా చేశాను. ఈ విరామ సమయంలో బీజేపీ యేతర పార్టీలను ఒకే వేదికపైకి తెస్తాం’ అని శరద్ యాదవ్ బదులిచ్చారు. గోరఖ్‌పూర్‌లో బీజేపీ ఓటమి ఆషామాషీ వ్యవహారం కాదని, యూపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఓ గుణపాఠం అలాగే బీజేపీ అధినాయకత్వానికి ఓ సంకేతం అని ఆయన అన్నారు. బీజేపీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని 2019 ఎన్నికల్లో ఆపార్టీ ఓటమి ఖాయమని శరద్ యాదవ్ జోస్యం చెప్పారు. ‘బీజేపీ దాని మిత్రపక్షాలు యూపీ, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే అత్యధిక సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడా రాష్ట్రాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ పాలనపై ఏ వర్గం కూడా సంతోషంగా లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ హిందూ-ముస్లిం అజెండా వర్కవుట్ కాదని ఆయన తేల్చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘రాజకీయ అవినీతి’ తారస్థాయికి చేరిందని ఆయన ఆరోపించారు. మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ దక్కినా దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి రావడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందన్నదాటి అనేక ఉదాహరణలున్నాయని ఆయన తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయిన శరద్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితోనూ త్వరలో సమావేశమవుతానని ఆయన వెల్లడించారు. ‘ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డీఏ మునుగుతున్న నౌక. శివసేన, టీడీపీ బయటకు వచ్చేశాయి. మున్ముందు మరిన్ని పార్టీలు వైదొలుగుతాయి’ అని ఆయన జోస్యం చెప్పారు.