జాతీయ వార్తలు

రంగంలోకి కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయేపై అవిశ్వాసం పెట్టిన తెదేపా, వైకాపాలకు కొత్త బలం చేకూరింది. గత ఆరు రోజులుగా పార్లమెంట్‌లో సాగుతోన్న డ్రామాను సునిశితంగా పరిశీలిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అకస్మాత్తుగా ఎన్డీయేపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగించటంతో ఢిల్లీ రాజకీయంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానాన్ని సంధించింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే ఎన్డీయే మంత్రివర్గంపై అవిశ్వాసాన్ని ప్రకటించారు. ఈమేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు శుక్రవారం మధ్యాహ్నం అవిశ్వాస తీర్మానం నోటీసును అందించారు. తన అవిశ్వాస తీర్మానాన్ని 27నాటి లోక్‌సభ కార్యక్రమాల్లో చేర్చాలని కోరారు. ఇంతవరకు లోకసభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, వైకాపా సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గత ఆరు రోజుల నుండి నరంద్ర మోదీ మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తుండటం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ కూడా ఎన్డీయే పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించటంతో అవిశ్వాస తీర్మానాల రాజకీయం కొత్త మలుపు తిరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నాడిఎంకె సభ్యులు ప్రతి రోజూ పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తుండటంవల్ల తెదేపా, వైకాపాలు ప్రతిపాదిస్తున్న అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకపోతుండటం తెలిసిందే. సభ ఆర్డర్‌లో లేనందున అవిశ్వాస తీర్మానాలను సభలో ప్రతిపాదించలేకపోతున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రతిరోజూ లోక్‌సభలో ప్రకటిస్తుడటంతో పార్లమెంట్‌లో నాటకీయ ఫక్కీ సాగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మోదీ మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం
ప్రతిపాదించటంతో వచ్చే మంగళవారం లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏంచేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే మంగళవారం కూడా తెరాస, అన్నాడిఎంకె సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిఘటించే అవకాశాలూ ఉన్నాయ. కాబట్టి ఆరోజు లోక్‌సభ రణరంగంగా మారవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ. మల్లికార్జున ఖర్గే ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు ప్రతిపాదించాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు పట్టుపడితే లోక్‌సభలో పెద్దఎత్తున గందరగోళం చోటుచేసుకోవటం ఖాయం. తెదేపా, వైకాపాలు కూడా మంగళవారం నాటికి మోదీ మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించాయి. తెదేపా పక్షం నాయకుడు తోట నరసింహం, వైకాపా సభ్యుడు సుబ్బారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం తమ అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు అందించారు. సుమిత్రా మహాజన్ మంగళవారం వీటితోపాటు ఖర్గే ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులనూ చర్చకు ప్రతిపాదించాల్సి ఉంటుంది.