జాతీయ వార్తలు

మళ్లీ.. హజారే ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: ఏడేళ్ల క్రితం తన అవినీతి వ్య తిరేక ఉద్యమంతో దేశ ప్రజలు అందరినీ కదిలించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నివరధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. శుక్రవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆయన ఈ నిరశనను మొదలుపెట్టారు. 2011లో కూడా ఇదే వేదికపై ఆయన అవినీతి వ్యతిరేక శంఖారావం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలనే లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ ఉద్యమాన్ని చేపట్టారు. గత కొంతకాలంగా కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని, రా ష్ట్రాల్లో వాటికి అనుబంధంగా లోకాయుక్తలను స్థాపించాలని హజారే డిమాండ్ చేస్తూ వచ్చినప్పటికీ, ఇంతవరకూ వాటికి సంబంధించి ఎలాంటి కదలికా లేకపోవడంతో ఆయన మళ్లీ నిరవధిక నిరశనకు దిగారు. అలా గే వ్యవసాయ సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన స్వామినాథన్ నివేదికనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే రోజును హజారే తన దీక్ష ఎంపిక చేసుకోవడానికి కారణం భగత్‌సింగ్, రాజ్‌గు రు, సుఖ్‌దేవ్‌లను నాటి వలసపాలకులు ఉరితీసిన రో జు కావడమేనని ఆయన చెబుతున్నారు. తాజా ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే హజారే గట్టి కసరత్తే చేశారు.

చిత్రం..రామ్‌లీలా మైదానంలో నిరశన చేపట్టిన అన్నా హజారే