జాతీయ వార్తలు

ఇది పెద్దల సభేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: రాజ్యసభలో ఎంపీల తీరుపై చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇది పెద్దల సభేనా? మనం ఎందుకిలా వ్యవహరిస్తున్నాం. దేశ ప్రజలు మన తీరుపై ఎంతో ఆదోళనతో ఉన్నారు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మన్ మాట్లాడుతూ ‘ప్రతి రోజూ సభ ప్రతిష్టంభనకు గురవుతోంది’ అంటూ తీవ్ర మనస్తాపం చెందారు. గొడవ, గందరగోళానికి గురవుతున్న రాజ్యసభను నిరవధికంగా ఎందుకు వాయిదా వేయటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై తనకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారని వెంకయ్య వెల్లడించారు.‘ ప్రజల అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరే దీనిపై ఆలోచించాలి’అని సభ్యులను ఉద్దేశించి వెంకయ్య చెప్పారు.
పెద్దల సభ తన విధులను గత మూడు వారాల నుంచి నిర్వహించటం లేదని, సభాధ్యక్షుడిగా సభను సజావుగా నడిపించేందుకు చేయగలిగినంత చేసినా ఫలితం కనిపించటం లేదని ఆయన వాపోయారు. సభలో ఎందుకిలా జరుగుతోందనే అంశంపై అన్ని పక్షాలు ఆలోచించుకోవాలని వెంకయ్య హితవుచెప్పారు. ఈ దశలో కొందరు సభ్యులు అభ్యంతరం చెప్పటంతో ‘ఏమిటిది? ఏమిటిది? సభాధ్యక్షుడిని కూడా మాట్లాడనివ్వరా?’ అంటూ ప్రశ్నించారు. సభాధ్యక్షుడు నిలబడి ఉన్నా గౌరవించరా? అంటూ మండిపడ్డారు. టీడీపీ సభ్యుడు సీఎం రమేష్, కాంగ్రెస్ సభ్యుడు కెవీపీ రామచందర్‌రావు పేర్లు ప్రస్తావిస్తూ ‘మొదట మీరు మీ సీట్లో కూర్చోండి’అంటూ ఆదేశించారు. ఈ ప్రతిష్టంభన ఎంత కాలం కొనసాగాలి? అంటూ చైర్మన్ నిప్పులు చెరిగారు. గతంలో ఇలా జరిగిందని ఇప్పుడు ఇలా చేయటం మంచిదా? అని నిలదీశారు. గత మూడు వారాల నుంచి ప్రైవేట్ మెంబర్ల బిల్లులు కూడా చర్చకు రావటం లేదని అన్నారు. రాజ్యసభలో చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల దేశ ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారని ఆయన మళ్లీ సభ్యులు దృష్టికి తెచ్చారు.