జాతీయ వార్తలు

మీ వైఖరేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టానికి సుప్రీం కోర్టు ఇచ్చిన మినహాయింపుపై కేంద్రం తన వైఖరి వెల్లడించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, సీనియర్ నేతలు ఆంటోని, ఎంఏ ఖాన్, కెవిపి రామచందర్‌రావు, టి సుబ్బిరామిరెడ్డి తదితర ఎంపీలు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయగానే అధికారులను అరెస్టుచేసే నియమాన్ని సవరిస్తూ సుప్రీం కోర్టు గత మంగళవారం తీర్పునివ్వడం తెలిసిందే. నిజాయితీపరులైన అధికారులను తప్పుడు కేసుల నుంచి రక్షించేందుకు ఈ ఉపశమనం కల్పిస్తున్నట్టు సుప్రీం పేర్కొనడం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పలువురు ఎస్సీ, ఎస్టీ నేతలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, సంఘాలు ఖండించటం తెలిసిందే. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం వెంటనే సవాల్ చేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పుమూలంగా ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు పెరిగి, నిందితులు తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం తన తీర్పును పునఃసమీక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరం కాపాడేందుకు రాహుల్ రంగ ప్రవేశం చేశారంటూ కాంగ్రెస్ ఎంపీలు పెద్దఎత్తున నినాదాలిచ్చారు. ఇదిలావుంటే తెలుగుదేశం ఎస్సీ ఎంపీ శివప్రసాద్ కూడా ధర్నాకు హాజరు కావటం చర్చనీయాంశమైంది. గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్, కాంగ్రెస్ ఎంపీల వద్దకు శివప్రసాద్ రాగానే, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారు. మీరిక్కడికి రావటం ఏమిటని శివప్రసాద్‌ను ప్రశ్నించారు. మీరు ధర్నాకు దూరంగా ఉండాలని కూడా ఖర్గే సూచించారు. అయితే రాహుల్ జోక్యం చేసుకుని శివప్రసాద్‌ను రానివ్వాలని సూచించారు. కాగా ఏపీకి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు ధర్నాకు హాజరుకావటంతో పాటు ఏపీకి న్యాయం చేయండి, ప్రత్యేక హోదా కల్పించండి అన్న డిమాండ్లతోవున్న ప్లకార్డులు ప్రదర్శించడం అందరినీ ఆకర్షించింది.

చిత్రం..పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన