జాతీయ వార్తలు

ఎత్తుకు పైఎత్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 23: మరికొన్ని నెలల్లో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో దేని కి అనుకూలంగా పరిణమిస్తాయన్నది ఇప్పటినుంచే ఆసక్తిని కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ తరువాత అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లకు అత్యంత కీలకం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. అందుకే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు కొన్ని నెలల వ్యవధి ఉన్నప్పటికీ కూడా అటు మోదీ, ఇటు రాహుల్‌గాంధీలు అడపాదడపా రాష్ట్రంలో పర్యటించి తమ విధానాలను ఎలుగెత్తి చాటుకుంటూ ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కర్నాటకలో అధికారం కాంగ్రెస్ పార్టీదే అయినప్పటికీ దాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధరామయ్య సారథ్యంలోని ఈ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో కర్నాటకలో అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న రీతిలో కాంగ్రెస్ అధినాయకత్వం ముందునుంచీ పావులు కదుపుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో వైఫల్యాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, కర్నాటకను కోల్పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమే అవుతుంది. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అట్టడుగు స్థాయినుం చి కార్యకర్తల బలాన్ని పెంపొందించుకునేందుకు రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మక రీతిలోనే అడుగులు వేస్తున్నారు. మరోపక్క అప్రతిహత రీతిలో ఒకదాని తరువాత ఒకటిగా కాంగ్రె స్ పాలిత రాష్ట్రాలను చేజిక్కించుకుంటూ దేశవ్యాప్తంగా తన బా వుటా ఎగురవేస్తున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌ను దక్షిణాదిన గట్టిగా దెబ్బతీయాలంటూ కర్నాటకలో అధికారా న్ని సాధించడమే సరైన మార్గమని భావిస్తోన్న బీజేపీ నాయకత్వం దానికి అనుగుణంగానే రాజకీయ పాచికలు విసురుతోంది. దక్షిణాదిన అడుగుపెట్టాలం టే కర్నాటకలో అధికారాన్ని సంతరించుకోవడమే కీలకమార్గమని భావించిన బీజేపీ దానికి అనుగుణంగానే తమదైన రీతిలో ముం దుకు వెళ్తోంది. ఇంతకీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉ న్నాయి? అవి ఎవరికి అనుకూలిస్తాయి? రాహుల్ వ్యూహం ఫలిస్తుందా? బీజేపీ వ్యూహ ధురంధరుడు అమిత్ షా ఎత్తులు పారతాయా? అన్నది ఆసక్తిని కలిగిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో కుల వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తుంది. దాదాపుగా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రా ల్లో కులాలే విజేతలను నిర్థారిస్తున్నప్పటికీ, కర్నాటకలో ఈ పరిస్థితి మరింత బలంగా ఉంది. అందుకే ఎన్నికల బరిలోకి దిగే అన్ని పార్టీలూ కుల సమీకరణాల ప్రాతిపదికనే వ్యూహరచన చేస్తాయి. ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎవరిని అక్కు న చేర్చుకుంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? నియోజకవర్గాల వారీ కూడా కులాల ప్రాబల్యం ఏమిటన్నది అన్ని పార్టీల ఎన్నికల వ్యూహరచనలో కీలక భాగమే అవుతుంది. ప్రధానంగా ఏ పార్టీకైనా విజయం సిద్ధించాలంటే రెండు అంశాలను రాష్ట్రంలో ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జెడీఎస్ తన బలాన్ని క్రమంగా పెంచుకుంటూ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు సవాల్‌ను విసురుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు జేడీఎస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మైసూ ర్ ప్రాంతంలో ఈ పార్టీ ప్రాబ ల్యం అపారంగా ఉంది. రాను న్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జేడీఎస్ అధినేత దేవగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుని పోటీ చేయాలన్న ఉద్దేశంలో లేరు. మిగతా రాష్ట్రాల మాదిరిగానే ప్రధాని మోదీ నాయకత్వ ప్రాబ ల్యం కర్నాటకలోనూ క్రమంగా పెరుగుతోంది. తాజాగా జరిగిన సర్వే ప్రకారం హిందీ భాషా రాష్ట్రాల్లో మోదీకి ఎంత ప్రాబల్యం ఉందో కర్నాటకలోనూ అంతే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే, మోదీ నాయకత్వ పటిమే ఆ పార్టీని గట్టెక్కించాల్సి ఉంటుంది. అలాగే కాంగ్రెస్ నాయకత్వం వేసే పాచికలు కర్నాటక కోస్తా ప్రాంతంలో బీజేపీకి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. మొత్తం మీద 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు ఏవిధంగా ఉండబోతాయన్న దానిపై కర్నాటక ప్రజలు ఇచ్చే తీర్పే బలమైన సంకేతం అవుతుందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే యూపీ ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ కర్నాటక విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించే అవకాశమూ స్పష్టంగా కనిపిస్తోంది. వరుస విజయాలు బీజేపీని వరుస పరాజయాల కాంగ్రెస్ అసలు నిలువరించగలుగుతుందా? అన్నది ఎన్నికలతో తేలిపోతుంది.