జాతీయ వార్తలు

చిక్కుల్లో సల్మాన్‌ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను రియో ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్ హోదా నుంచి తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ‘సుల్తాన్’ షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సల్మాన్ తరఫున అతడి తండ్రి, సినీ రచయిత సలీమ్‌ఖాన్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దీనిపై సల్మాన్‌ఖాన్ క్షమాపణలు చెప్పాలని పలు మహిళా సంఘాలు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. తాజా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అతడిని అంబాసిడర్ హోదా నుంచి తప్పించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఆలోచిస్తోంది. సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యలు తప్పుడు సంకేతాన్ని ఇచ్చేలా ఉన్నాయంటూ ఐఓఏ సంయుక్త కార్యదర్శి రాకేష్ గుప్తా స్పష్టం చేశారు. తన షూటింగ్ అనుభవాలకు మరో ఉదాహరణ చెప్పి ఉండాల్సిందని, మహిళలు, దేశ ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడడం గర్హనీయమని అన్నారు. తక్షణం సల్మాన్‌ఖాన్ క్షమాపణలు చెప్పాలని గుప్తా డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని గుడ్‌విల్ అంబాసిడర్‌గా కొనసాగించడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అలాగే క్రీడాస్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఐఓఏ అధికారి అన్నారు. ఈ వ్యవహారంపై సల్మాన్‌ఖాన్‌తో మాట్లాడడానికి తాను ప్రయత్నించానని, అతడు అవార్డుల ప్రదానోత్సవం కోసం స్పెయిన్‌లో ఉన్నట్టు తెలిసిందని ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా రియో వెళ్లే క్రీడాకారులకోసం జూలై మూడోవారంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానితుల జాబితాలో ఖాన్ పేరు ఇప్పటికే తొలగించినట్టు డిఎన్‌ఏ వార్తా సంస్థ వెల్లడించింది. సల్మాన్‌కు రియో గుడ్‌విల్ అంబాసిడర్‌గా కొనసాగించడం సరైందికాదని పలువురు క్రీడాకారులు విమర్శిస్తున్నారు.