జాతీయ వార్తలు

బిహార్‌లో మరో ‘నిర్భయ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 23: ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా బిహార్‌లోని మోతిహరిలో ఓ 21 ఏళ్ల యువతిని తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుండగులు అనంతరం ఆ యువతి జననాంగంలో పిస్టల్ భాగాలను, కలప ముక్కలను కుక్కి తమ క్రూరత్వాన్ని, పైశాచికానందాన్ని చాటుకున్నారు. యువతి జననాంగంలో పిస్టల్ భాగాలు, కలప ముక్కలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని ఒక న్యూస్ చానల్ తెలిపింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితుల్లో ఒకరిని సమీయుల్లాగా గుర్తించారు. సమీయుల్లా గతంలో ఒకసారి ఈ యువతిపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు దాన్ని ఎంఎంఎస్ క్లిప్‌గా చిత్రీకరించాడు. ఆ ఎంఎంఎస్‌తో అతను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించగా ఆమె అతడిని బ్లేడ్‌తో కొట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన సమీయుల్లా ఇతరులతో కలిసి ఆ యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడడంతో పాటు క్రూరంగా హింసించాడు.
‘వారు నన్ను రేప్ చేశారు. తరువాత వారు నన్ను కొట్టారు. ఆ తరువాత వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి నన్ను కొట్టారు’ అని బాధితురాలు చెప్పినట్లు ఆ న్యూస్ చానల్ తెలిపింది.