జాతీయ వార్తలు

ఢిల్లీ వచ్చిన పాక్ ‘పఠాన్‌కోట్’ దర్యాప్తు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: పఠాన్ కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి ఘటనపై దర్యాప్తు జరపడం కోసం పాకిస్తాన్‌నుంచి అయిదుగురు సభ్యులతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందం ఆదివారం ఇక్కడికి చేరుకుంది. ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో దర్యాప్తు జరపడం కోసం పాకిస్తాన్‌కు చెందిన ఒక బృందం భారత్ రావడం ఇదే మొదటిసారి. ఈ బృందంలో పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చెందిన అధికారి కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్‌ఐఏ) జరిపిన దర్యాప్తులను సైతం ఈ బృందం విశే్లషిస్తుంది. బృందానికి విమానాశ్రయంలో ఎన్‌ఐఏ, పాక్ హైకమిషన్‌కు చెందిన అధికారులు స్వాగతం పలికారు. గత జనవరి 2న పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద ముఠా భారత వైమానిక దళానికి చెందిన స్థావరంపై జరిపిన దాడిపై దర్యాప్తు జరపడం కోసం ఈ బృందం మంగళవారం పఠాన్‌కోట్ వెళ్తుంది.