జాతీయ వార్తలు

150 స్థానాల్లో గెలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 19: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. మే 12న కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శివమొగ్గ జిల్లాలోని శిఖరిపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యెడ్యూరప్ప గురువారం నామినేషన్ దాఖలు చేశారు. చత్తీస్‌గఢ్ సీఎం రామణ్ సింగ్, కేంద్ర మంత్రులు అనంతకుమార్, రమేష్ జిగాజినగితో కలిసి వచ్చి ఆయన నామినేషన్ వేశారు. అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప, సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. దక్షిణాదిన తొలిసారి 2008లో బీజేపీ అధికారం చేపట్టింది. బీఎస్ యెడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 2011లో యెడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. తరువాత బీజేపీ నుంచి వైదొలగి కర్నాటక జనతా పార్టీ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నికల్లో ఆయన పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించాక యెడ్యూరప్ప తిరిగి సొంత కూటికి చేరారు. ఇలా ఉండగా విధాన మండలిలో ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప శివమొగ్గ నియోజవర్గ నుంచి నామినేషన్ వేశారు. ఈశ్వరప్ప గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కురుబ వర్గానికి చెందిన ఆయన 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఒక్కలింగ నాయకుడు డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ నియోజవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సోదరుడు, ఎంపీ డీకే సురేష్, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన నామినేషన్ వేశారు. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలు సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 44 మందికి తన రిస్టార్ట్‌లో బస కల్పించారన్న ఆరోపణలపై శివకుమార్‌పై ఐటీ దాడులు జరిగాయి. ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ దుమారమే రేపింది. ఇక బీజేపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆర్ అశోక పద్మానగర్ నుంచి, పర్యావరణ మంత్రి రామానాథ్ రాయ్ బంట్వాల్ నుంచి, మాజీ సీఎం బంగారప్ప కుమారుడు, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మధు బంగారప్ప సొరాబా నుంచి నామినేషన్లు వేశారు.
చిత్రం..బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యెడ్యూరప్ప తదితరులు