జాతీయ వార్తలు

ఆర్‌టీఐ దరఖాస్తులను తిరస్కరించినవాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఒకవైపు పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులు, మరోపక్క నిఘా సంస్థల విచారణలతో కునారిల్లుకుపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సమాచార హక్కు చట్టం కింద (ఆర్‌టీఐ) అభ్యర్థనలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో ఆర్‌టీఐ దరఖాస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరస్కరిస్తున్నట్టు ఒక స్వచ్ఛంద సంస్థ నివేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం సంస్థలకు వచ్చిన ఆర్‌టీఐ దరఖాస్తుల్లో 9 శాతం, ఆర్‌బీఐ సహా 26 ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చాయి. ఇక మొత్తం ప్రభుత్వ సంస్థలు తిరస్కరించిన దరఖాస్తుల్లో 33 శాతం కేవలం బ్యాంకులే కావడం విశేషం. కామన్‌వెల్త్ హ్యూమన్‌రైట్స్ ఇనిషియేటివ్ సంస్థ, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వార్షిక నివేదిక ఆధారంగా ఈ సమాచారాన్ని బయటపెట్టింది. సీహెచ్‌ఆర్‌ఐ నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు అందిన మొత్తం ఆర్‌టీఐ దరఖాస్తులు 86,000. అయితే మిగిలిన ప్రభుత్వ సంస్థలతోపోలిస్తే, బ్యాంకులు తిరస్కరించిన దరఖాస్తులే అధికమని నివేదిక స్పష్టం చేసింది. వీటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 71 శాతం అప్లికేషన్లను తిరస్కరించి అగ్రస్థానంలో ఉంది. ఇక ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 50 శాతం, కార్పొరేషన్ బ్యాంకు 47.3%, ఆంధ్రాబ్యాకు 45.9%, ఆర్‌టీఐ దరఖాస్తులను తిరస్కరించాయి. దేనా బ్యాంకు, కెనరా బ్యాంకు 40 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులను తిరస్కరించాయి.