జాతీయ వార్తలు

సుప్రీం తీర్పు చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సొహ్రాబుద్దీన్ కేసును విచారించిన న్యాయమూర్తి బీహెచ్ లోయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల వెనక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నారని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. న్యాయమూర్తి లోయ మృతిపై దాఖలైన పలు పటిషన్లను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసిన తరువాత సంబిత్ పాత్రా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశా రు. న్యాయమూర్తి లోయ మరణానికి దారితీసిన పరిస్థితులపై స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించవలసిన అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి లోయ మరణానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో లింక్‌పెట్టిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఏమంటాయని ఆయన నిలదీశారు. న్యా యమూర్తి లోయ ఆకస్మిక మరణాన్ని రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి, తప్పు డు ఆరోపణలతో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖ లు చేయించాయని పాత్రా ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకోసం న్యాయమూర్తి లోయ మరణంపై సుప్రీం కోర్టులో తప్పుడు పిటిషన్లు దాఖలు చేయించిందని ఆయన దుయ్యబట్టారు. లోయ మరణంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల వెనక ఉన్న అదృశ్య హస్తం రాహుల్ గాంధీదని సంబిత్ పాత్రా చెప్పారు. రాహుల్ గాంధీ ముందుకు వచ్చి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు, దేశ ప్రజలకు, న్యాయ వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీ అసమర్థత మూలంగా అధికారం కోల్పోయి అక్కసుతో బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తారా? అని పాత్రా ప్రశ్నించారు. అమిత్ షాను అపఖ్యాతిపాలు చేసేందుకే ఈ పిటిషన్లు దాఖలయ్యాయి, అయితే సుప్రీం కోర్టు ఇవన్నీ రాజకీయ దురుద్దేశ్యంతో దాఖలైన పిటిషన్లంటూ కొట్టి వేయటం ద్వారా రాహుల్ గాంధీకి గట్టి గుణపాఠం నేర్పింద ని పాత్రా చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని రాజకీయంగా ఎదుర్కొనలేని కాంగ్రెస్ సుప్రీం కోర్టులో తప్పుడు పిటిషన్లు దాఖలు చేయటం ద్వారా బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నిందని సంబిత్ పాత్రా దుయ్యబట్టారు. గుజారాత్ శాసన సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఈ కుట్ర చేశారని సంబిత్ పాత్ర ఆరోపించారు. తమ రాజకీయ ప్రయోజనాలకోసం న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయటం సిగ్గుచేటని రవిశంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు. న్యాయమూర్తి లోయ మరణాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నంచిన రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు మంచి గుణపాఠం చెప్పిందని ఆయన అన్నారు.
చిత్రం..బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా