జాతీయ వార్తలు

‘అభిశంసన’తో బయటపడ్డ విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై ఏడు ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన అభిశంసనను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహల్ గాంధీకి పార్టీ సీనియర్ నాయకులతో ఉన్న విభేదాలను వెలుగులోకి తెచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకు రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ ఇతర మిత్రపక్షాలతో చర్చించి దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని పెట్టించారు. దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రతిపాదించటాన్ని మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి, సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ తదితరులు బహిరంగంగా వ్యతిరేకించటం ద్వారా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. హోం శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం సైతం అభిశంసన తీర్మానంపై సంతకం పెట్టేందుకు నిరాకరించటం రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను చాటుతోందని అంటున్నారు. రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. వీరంతా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల తమకు విశ్వాసం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే అభిశంసన తీర్మాన ప్రతిపక్షాల్లో ఉన్న విభేదాలను కూడా తెర మీదకి తెచ్చింది. ప్రతిపక్షంలో అత్యంత ప్రధాన పాత్ర నిర్వహించే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డి.ఎం.కె అధ్యక్షుడు కరుణానిధి అభిశంసన తీర్మానానికి మద్దతు ప్రకటించకపోవటం గమనార్హం. అభిశంసన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు కాంగ్రెస్ ఎం.పిలు పార్లమెంటు ఉభ సభలో దీనిపై చర్చ జరిగినప్పుడు అభిశంసనకు వ్యతిరేకంగా ఓటు వేసినా ఆశ్చర్యపోకూడదని అంటున్నారు.