జాతీయ వార్తలు

ధర్మ పోరాటం పేరుతో ప్రధానిపైనే నిందలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించిన టీడీపీ శాసనసభ్యుడు, నటుడు బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతిని ధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. నరసింహారావు శనివారం వి లేఖరులతో మాట్లాడుతూ సీఎం చం ద్రబాబు నిరాహారదీక్ష చేసిన శిబిరా న్ని ప్రధాని మోదీని నిందించేందుకు ఉపయోగించుకున్నారని ఆ యన ఆరోపించారు. ‘్ధర్మ పోరాటం’ పేరుతో డబ్బులు వృథా చేశారు.. చంద్రబాబు అనవసర భయాలకు లోనవుతున్నారని నరసింహారావు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బజా రు సంస్కృతికి ఇది అద్దం పడుతోందని దు య్యబట్టారు. బాలకృష్ణకు బాధ్యత అనేది తె లుసా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేనా అని నరసింహారావు ప్రశ్నిచారు. రాష్ట్రాన్ని ఈగలు, దోమలతో పోల్చడం ఏమిటి? ఇదా వీరి సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు.
క్రైస్తవ మతానికి చెందిన శాసన సభ్యురాలు అనితను టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఒక క్రైస్తవ మతస్థురాలికి సభ్యత్వం కల్పించటం ఏమిటని నరసింహారావు ప్రశ్నించారు. హిందువులు తమ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పరమతస్థులు ఉండటం ఏమిటని ఆయన నిలదీశారు. శాసన సభ్యురాలు అనిత తాను క్రిష్టియన్ అని తనకు తానే చెప్పుకున్నది.. ఆమెను బోర్డు సభ్యురాలిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. టీటీడీలో అన్యమతస్థురాలిని నియమించటం ద్వారా ప్రపంచంలోని హిందువులనందరిని అవమానించారని నరసింహారావు విమర్శించారు. అనిత నియామకం తెలియక చేసిన చర్యలా లేదు.. హిందువుల మనోభావాలను దెబ్బకొట్టేందుకు.. ఓట్లకోసమే అన్య మతస్థురాలిని టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమించాలని ఆరోపించారు. గతంలో కాం గ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇలాంటి పని చేశారు, అదే పనిని ఇప్పుడు చంద్రబాబు చేశారని ఆరోపించారు. అనిత నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని నరసింహారావు డి మాండ్ చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పటంతోపాటు దేవుని సాక్షిగా చెంపదెబ్బలు వేసుకోవాలని.. మళ్లీ ఇలాంటి తప్పు చేయనని వాగ్దానం చేయాలని అన్నారు.