జాతీయ వార్తలు

ఇక గ్రామీణ ఈ-గవర్నెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: నగర, పట్టణ ప్రాంతాల్లో ఈ-గవర్నెన్స్ అద్భుతమైన ఫలితాలు సాధించడంతో ఇక గ్రామీణ ప్రాంతాల వైపు కేంద్రం దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రీయ గ్రామ్ స్వ రాజ్ అభియాన్ పేరుతో కొత్త పథకానికి ఎకనమిక్ ఎఫైర్స్ కేబినెట్ కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. ఈ నెల 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని లాం ఛనంగా ప్రారంభిస్తారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఈ పథ కం కింద గ్రామీణ యువతకు శిక్ష ణ, వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు. అయితే కేంద్ర-రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం 90 శాతం నిధు లు భరిస్తుంది. ఇక కేంద్ర పాలిత ప్రాం తాల్లో పథకం మొత్తానికి కేంద్ర నిధులు అందిస్తుందని తోమర్ వివరించారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.7255.50 కోట్ల ను ఖర్చు చేస్తారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్‌లో ని మాంద్లా జిల్లాలో ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. గ్రామ పంచాయత్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో భాగం గా గ్రామాల్లో జరిగే ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ఫోటోలతో సహా వివరించాల్సి ఉంటుంది. అభివృద్ధిలో గ్రామ పంచాయతీలను ప్రోత్సహించేందుకుగా ను ప్రతి ఏడాది అవార్డులను సైతం అందజేస్తారు. అందుకుగాను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ శశక్తికరణ్ పురస్కార్, నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ్ సభ పురస్కార్, ఈ-పంచాయత్ పురస్కారాలను అందించడం జరుగుతుందని తోమర్ తెలిపారు.