జాతీయ వార్తలు

రాజకీయాలకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వత్ సిన్హా సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ‘పార్టీ రాజకీయాలకు పూర్తిగా దూరమవుతున్నా. దేశంలో ప్ర జాస్వామ్య పరిరక్షణకే ఇక పని చేస్తా’ అని వెల్లడించారు. చాలాకాలంగా బీజేపీ నాయకత్వంతో సిన్హాకు పొసగకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది జగమెరిగిన సత్యం. కేంద్రంలోని బీజేపీ పాలన వైఖరిని నిరసిస్తూ, విపక్షాలను కూడదీసి గత జనవరి 30న ఏర్పాటు చేసి న ‘రాష్ట్రీయ మంచ్’ సమావేశంలోనే సిన్హా ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘బీజేపీతో నాకు సుదీర్ఘ అనుబంధముంది. ఆ బంధాన్ని ఈరోజు నుంచే తెంచేసుకుంటున్నా’ అని 80ఏళ్ల సిన్హా ప్రకటించారు. పాట్నా సాహిబ్, ఎంపీ శతృజ్ఞ సిన్హా సహా కాంగ్రెస్, ఆర్జేడీ, బీజేపీ రెబెల్స్, ఆప్, తృ ణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో యశ్వంత్ ఈమేరకు ప్రకటన చేయడం గమనార్హం. ‘నిజానికి ఓటు రాజకీయాలకు నాలుగేళ్ల నుంచీ దూరంగానే ఉంటున్నా. ఇప్పుడు పూర్తిగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నా’ అని యశ్వంత్ స్పష్టం చేశారు. మరే రాజకీయ పార్టీలోనూ సభ్యత్వం స్వీకరించబోవటం లేదని స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శిస్తూ, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బలమైన ఉద్యమాన్ని ఆవిష్కరించబోతున్నట్టు ప్ర కటించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడిందని వ్యాఖ్యానించారు.

చిత్రం..పాట్నాలో జరిగిన రాష్ట్రీయ మంచ్ సమావేశంలో మాట్లాడుతున్న
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా