జాతీయ వార్తలు

గొడవల్లేవ్.. గద్దె మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కర్నాటకలో తాము మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని సీనియర్ కాంగ్రె స్ నాయకుడు వీరప్ప మొ యిలీ ఉద్ఘాటించారు. తమ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కు సంబంధించి ఎలాంటి గొడవలు లేకపోవడం, అ లాగే నిరసనలకు కూడా ఆస్కారం లేని రీతిలో అభ్యర్థుల ఎంపిక జరగడం ఇందు కు నిదర్శనమని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించడంతో రాష్ట్ర నాయక త్వం వ్యూహాత్మకంగా ఐక్య దృక్పథం తో పనిచేస్తోందని మొయిలీ తెలిపారు. ము ఖ్యమంత్రి సిద్ధరామయ్య హయాంలో రా ష్ట్రంలో రాజకీయంగానూ, సామాజికం గా, ఆర్థిక సుస్థిరత సాధ్యమైందని, ఆయన పా లనలో ప్రజలకు ఎంతగానో మేలు జరిగిందని వెల్లడించారు. అయితే అడపా దడ పా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నిరసనలు వ్యక్తమవుతున్నా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించా రు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న బలమైన నమ్మకం ఉంది కాబట్టే పోటాపోటీగా అభ్యర్థులు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యా ప్తంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా రాజకీ య పవనాలు వీస్తున్నాయని, ఇది కూడా ఆ పార్టీదే మళ్లీ అధికారం అని చెప్పడానికి బ లమైన సంకేతమని అన్నారు. అయితే అం తర్గత పోరు కారణంగా పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయా అన్న ప్రశ్నకు, అస లు కాంగ్రెస్ పార్టీలో ఈ ఐదేళ్ల కాలంలో అంతర్గత లుకలుకలే లేవని, సామరస్యపూర్వక రీతిలోనే సిద్ధరామయ్య పాలన సాగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అంతర్గత పోరాటాలు పరస్పరం వ్యతిరేకించుకోవడం అన్నది రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉండే అవకాశం లేదన్నారు. అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో అనుసరించాల్సిన ప్రామాణికతపై వీరప్ప మొయిలీ, మల్లికార్జున ఖర్జే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర మధ్య విభేదాలున్నట్లు కథనాలు వచ్చాయి. కొత్తగా పార్టీకి వచ్చిన వారికంటే కూడా పార్టీని నమ్ముకు న్న వారికే టిక్కెట్లు ఇవ్వాలన్న వాదన బలం గా వినిపించింది. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడంలో విజయం సాధించా రు. అయితే ఇది మామూలు విషయమని, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సామరస్యపూర్వకంగా వ్యవహారం సాగిందని మొయిలీ స్పష్టం చేశారు.