జాతీయ వార్తలు

మోదీజీ.. మీకది తగునా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వైద్యులపై రోగులకున్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రధాని హోదాలో వ్యాఖ్యలు చేయ డం సముచితం కాదంటూ నరేంద్ర మోదీకి వైద్యులు ఓ లేఖ రాశారు. లండన్ పర్యటనలో వైద్య వృత్తిపై మీ రు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అసంతృప్తిని కలిగించాయం టూ భారతీయ వైద్యుల సమాఖ్య (ఐఎంఏ), మెడికల్ కన్సల్టెంట్ల అసోసియేషన్ సభ్యులు ఆదివారం ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. వైద్యులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని, కాన్ఫరెన్స్‌ల కోసం వైద్యులు విదేశాలకు వచ్చేది ఫార్మాస్యూటికల్స్ సంస్థలను ప్రమోట్ చేయడానికేనంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయడా న్ని తప్పుబట్టారు. ‘మీ వ్యాఖ్యలు ఒక వైద్యుడిపై రోగికివున్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసేవే. వైద్యులపట్ల మీకున్న అభిప్రాయాన్ని మార్చుకుని, వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నాం. రోగంతో బాధపడుతున్న వ్యక్తి త్వరగా కోలుకోవడానికి ఔషధాలతోపాటు వైద్యుడిపై నమ్మకం కూడా అవసరమన్న విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు’ అం టూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధాని వ్యా ఖ్యలపై ఐఎంఏ సభ్యుడు డాక్టర్ రవి వాంఖేడ్‌కర్ విచా రం వ్యక్తం చేస్తూ ‘ప్రధాని మోదీ వ్యాఖ్యలు మమ్మల్ని తీవ్ర విచారానికి గురి చేశాయి. అదీ వైద్య వ్యవస్థను 70శాతం భారతీయులే నడుపుతున్న యూకేలో ప్రధా ని ఇలా మాట్లాడటం ఎంతమాత్రం సహేతుకం కాదు. నిజానికి ఔషధ ధరలు ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కానీ, వైద్యుల చేతిలో కాదు. మోదీ తన వ్యాఖ్యలను ఒక్కసారి పునఃస్సమీక్షించుకోవాలని మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం’ అన్నారు. మరో వైద్యుడు వినోద్ శర్మ మాట్లాడుతూ ‘ప్రధాని స్థాయికి తగని వ్యాఖ్యలవి. ని జానికి విదేశాల్లో కాన్ఫరెన్స్‌లకు వెళ్లేది వైద్యు వృత్తిలోని ఆధునిక విధానాలు, కొత్త మందులను తెలుసుకోవడానికి. మరో విషయం ఏంటంటే, విదేశాల్లో నిర్వహించే కాన్ఫరెన్స్‌లకు ఏ ఫార్మా కంపెనీ కూడా స్పాన్స ర్ చేయదు’ అన్నారు. మంబయిలోని ఏఎంసి సభ్యురాలు డాక్టర్ వీణా పండిట్ మాట్లాడుతూ ‘వైద్య వ్యవస్థలో అక్కడక్కడా పొరబాట్లు ఉండి ఉండొచ్చు. వ్యవస్థలోని వైద్యులంతా అలాగే ఉంటారనడం ప్రధాని హోదాకు ఎంతమాత్రం తగింది కాదు. అదీ విదేశీ వేదికలపై భార త వైద్య వ్యవస్థను కించపర్చటాన్ని ఎలా సమర్థించాలి. ప్రభుత్వ వైఫల్యాలను వైద్యుల మీదకు నెట్టేయడం సముచితం కాదు’ అన్నారు. ప్రధాని మోదీ యూకే పర్యటనలో భాగంగా వెస్ట్‌మినిస్టర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్న వైద్యులకు చెక్ పెట్టేందుకు కేంద్రం జనరిక్ మందుల షాపులను అందుబాటులోకి తెచ్చిందంటూ వ్యాఖ్యానించడం తెలిసిందే.