జాతీయ వార్తలు

హింసకు తావివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/జోధ్‌పూర్, ఏప్రిల్ 24: బాబా ఆశారాం బాపూపై నమోదైన అత్యాచారం కేసుకు సంబంధించి బుధవారం కీలక తీర్పు వెలువడుతున్న దృష్ట్యా రాజస్థాన్, గుజరాత్, హర్యానాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జోధ్‌పూర్ కేసు ఇవ్వనున్న ఈ తీర్పు ఎలా ఉన్నప్పటికీ శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అదనపుబలగాలు మోహరించారు. శాంతి పరిరక్షణ విషయంలో ఎలాంటి అపశృతులకూ తావులేకుండా గట్టి ఏర్పాట్లు చేయాలని హోమ్‌మంత్రిత్వశాఖ ఈ మూడు రాష్ట్రాలను కోరింది. ఎట్టిపరిస్థితుల్లోనూ శాంతియుత పరిస్థితులు దెబ్బతిని హింసాత్మక ఘటనలు తలెత్తడానికి వీల్లేదని ఆదేశించింది. అవసరమైతే అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపుబలగాలు మోహరించాలని ఈ రాష్ట్రాలను కోరింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానాలో ఆశారాం బాపు అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్న దృష్ట్యా ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కేసు తీర్పు దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కోరినట్టు హోమ్‌శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.