జాతీయ వార్తలు

కెప్టెన్ ఆయనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలబురగి (కర్నాటక), ఏప్రిల్ 24: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై ఎలాంటి సందేహాలు లేవని, మంచి మెజా ర్టీ సాధిస్తామని సీనియర్ నాయకుడు, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ నిర్ణ యం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు సంకేతమవుతుంది. కాబోయే సీఎంకు అధినాయకత్వం నుంచి త్వరలోనే ఫోన్ రాబోతోంది’ అన్నారు. అయితే, పార్టీ దృష్టి లో సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్య లేరన్న విషయాన్ని ఖర్గే చెప్పకనే చెప్పారు. ప్రస్తు త ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యేల అభిప్రాయాలను క్రోడీకరించి అధిష్టానమే సీఎం ఎవరనేది నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముఖ్య బాధ్యతలను సీఎం సిద్ధరామయ్యకే అప్పగించినా, ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయనే సీఎం అన్న విషయాన్ని ప్రకటించడానికి కాంగ్రెస్ ఇష్టపడటం లేదన్నది ఖర్గే వ్యాఖ్యల్లో స్పష్టమైం ది. అయితే, ఖర్గే వ్యాఖ్యలను లోతుగా విశే్లషిస్తే సీఎం బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న అంశంపై ఇప్పటికే అధినాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం కాబోతున్నారన్న మీడియా ప్రశ్నకు ఖర్గే స మాధానమిస్తూ ‘ఎన్నికలవేళ అనవసర వివాదాలపై మాట్లాడటమెందుకు? సీఎం (సిద్ధరామయ్య) ఉన్నారు. ఆయనే ముం దున్నారు, ఎన్నికల ప్రచారాన్నీ ముందుకు నడిపిస్తున్నారు. నాయకత్వ బాధ్యతలు ఆయన చేతిలో ఉన్నంతవరకూ ఆయన కెప్టెన్’ అని ఖర్గే నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ‘ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నాయకత్వ బాధ్యతలను మార్చే అధికారం అధిష్టానానికి ఉంటుంది. ఎప్పటికీ హైకమాండే సుప్రీం. ఎన్నికల తరువాత ఎంపికైన ఎమ్మెల్యేలను సంప్రదించి, వారి అభిప్రాయ ఆ మోదం మేరకు సీఎంని నిర్ణయిస్తుంది. ఇం దులో ఎలాంటి మార్పూ ఉండదు’ అని ఖ ర్గే స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిత్వంపై ముందే ఒక నిర్ణయానికి వచ్చిన దగ్గర్నుం చే బీజేపీ, జేడీఎస్‌లు సమస్యలతో సతమతమవుతున్నాయని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇప్పటికే బిజేపీ సీఎం అభ్యర్థిగా బిఎస్ యె డ్యూరప్ప, జెడీఎస్ సీఎం అభ్యర్థిగా హెచ్ డీ కుమారస్వామిని ప్రకటించడం తెలిసిం దే. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ప్రశ్నించినపుడు ‘గెలుపుపై మాకెలాంటి సందేహాలు లేవు. మంచి మెజారిటీ సాధిస్తాం కూడా’ అని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.