జాతీయ వార్తలు

పంచాయతీలకు మరింతగా జవసత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాండ్లా, ఏప్రిల్ 24: దేశంలో పంచాయతీ వ్యవస్థను మరింత పరిపుష్టం చేసేందుకు ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. దేశంలోని పంచాయతీ వ్యవస్థను మారుతున్న కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. మధ్యప్రదేశ్‌లో గిరిజనులు అత్యధికంగా ఉన్న రామ్‌నగర్ జిల్లాలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. స్వయం సమృద్ధి, ఆర్థికంగా స్థిరంగా ఉండటం మరింత సమర్థవంతంగా పనిచేసేలా దేశంలోని పంచాయతీలను తీర్చిదిద్దేందుకు ఈ కేంద్ర పథకం దోహదం చేస్తుంది. పంచాయతీల సామర్థ్యాన్ని, పటుత్వాన్ని పెంచడంతో పాటు అధికారాలు, బాధ్యతల పంపిణీ వంటి అంశాలపైనా ఈ పథకం దృష్టిపెట్టింది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఓ రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. గిరిజన పంచాయతీల అభివృద్ధి కోసం రానున్న ఐదు సంవత్సరాల కాలంలో రెండులక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామని తెలిపారు. ఇదే జిల్లాలోని మనేరి వద్ద ఎల్‌పీజీ ప్లాంటును కూడా మోదీ శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ-గవర్నెన్స్ పథకాన్ని సరైన రీతిలో అమలుచేసి ఫలితాలు సాధిస్తున్నందుకు పంచాయతీలను ఆయన అభినందించారు. సాంప్రదాయక ఇంధన వినియోగంనుంచి ఎల్‌పీజీకి మారడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంలోనూ తమతమ పరిధిలో బహిరంగ మలవిసర్జనను అరికట్టడంలోనూ ఈ పంచాయతీలు విజయం సాధించాయని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికగా బాణం-విల్లంబులను అందజేస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. చిత్రంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తదితరులు.